లాక్ డౌన్ కి సంబంధించి కేంద్రం పరిశీలించాలని సుప్రీం కోర్ట్ సూచించింది. కరోనా చైన్ ని బ్రేక్ చేయడానికి లాక్ డౌన్ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రెండో వేవ్ కి సంబంధించి చర్యలు విన్న తర్వాత సుప్రీం కోర్ట్ ఈ సూచనలు చేసింది. అదే సమయంలో, సామూహిక సమావేశాలు మరియు సూపర్ స్ప్రేడర్ ఘటనల విషయంలో సీరియస్ గా ఉండాలని రాష్ట్రాను కోరుతున్నామని తెలిపింది.
ఇక లాక్డౌన్ సమయంలో బలహీన వర్గాలను రక్షించడానికి ఏర్పాట్లు తప్పక జరగాలని భారత అపెక్స్ కోర్టు పేర్కొంది. లాక్ డౌన్ విధిస్తే అట్టడుగు వర్గాలను కాపాడుకోవడానికి ముంచే చర్యలు చేపట్టాలని సుప్రీం సూచనలు చేసింది. ఇక దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కేసులతో పాటు మరణాలు భారీగా పెరుగుతున్నాయి.