మోడీ పై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ఎందుకో తెలుసా..?

-

కరోనా వైరస్ ఆరంభంలో జరిగిన తబ్లీగి జమాత్ పై పరమైన విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రచారం చేశారు అంటూ ఆరోపిస్తూ జామియా ఉలేమా ఈ హింద్.. సహా మరికొంతమంది సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా ఈ పిటిషన్ పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఈ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పరిశీలించిన అత్యున్నత ధర్మాసనం… కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ పూర్తిగా ని స్పష్టంగా నిస్సిగ్గుగా ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా దేశంలో రోజు రోజుకి భావ ప్రకటన స్వేచ్ఛకు వాక్ స్వాతంత్రాన్ని కూడా విఘాతం కలుగుతుంది అంటూ మండి పడింది సుప్రీంకోర్టు. అయితే ఉద్దేశపూర్వకంగానే తబ్లీగి సమావేశం పై తప్పుడు ప్రచారం చేశారు అంటూ పిటిషనర్లు వాదించగా… అయితే తబ్లీగి సమావేశమై పలు మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేయగా వాటిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది అనే విషయాలను వెల్లడిస్తూ ఒక అఫిడవిట్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం.

Read more RELATED
Recommended to you

Exit mobile version