ఇటీవల అయోధ్య కేసులో చారిత్రాత్మక జడ్జిమెంట్ ఇచ్చిన సుప్రీంకోర్టు… నేడు మరో రెండు కీలక తీర్పులు వెలువరించనుంది. శబరిమల, రఫేల్ కేసుల్లో గతంలో ఇచ్చిన తీర్పులపై దాఖలైన రివ్వ్యూ పిటిషన్లపై తుదితీర్పులను ఇవ్వనుంది.రెండూ సంచలన అంశాలే కావడంతో ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని గత ఏడాది సెప్టెంబరు 28న ఇచ్చిన ఆదేశాలను పునపరిశీలించాలంటూ దాఖలైన 65 పిటిషన్లపై కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.
సుప్రీంతీర్పు అమలుకు కట్టుబడి ఉన్నామని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు పేర్కొంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై మోడీ ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని సమీక్షించాలని దాఖలైన పిటిషన్లపైనా ఇవాళ సుప్రీంతీర్పు ఇవ్వనుంది. రాఫెల్ డీల్‌లోనే ప్రధాని మోడీని ఉద్దేశించి చేసిన చౌకీదార్ చోర్ హై అన్న తన విమర్శను కాంగ్రెస్ నేత రాహుల్ సుప్రీం తీర్పునకు ఆపాదించడంపైనా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పనుంది.