వయస్సు ఆగేది కాదు. యవ్వనంలో ఉన్నప్పుడు చాలా టైమ్ ఉందిలే అనుకున్న వాళ్లంతా కొద్దిగా 30ల్లోకి వచ్చాక ఇంక టైమ్ లేదు అని అనుకుంటారు. అదీగాక యవ్వనంలో ఉండే ఎనర్జీ వయసు పెరుగుతున్న కొద్దీ తగ్గుతూ వస్తుంది. యువతలో ఉత్సాహం ఉరకలేస్తుంది. కొందరు యవ్వనంలో ఉన్నా కూడా నిస్సత్తువగానే ఉంటారనుకో. ఐతే తమ వయసు కంటే ఎక్కువ వయసు వారిగా కనబడుతున్నారని మీకనిపిస్తుందా? అలా కనిపిస్తే మీ శరీరం కొన్ని సంకేతాలనిస్తుంది. అవి వెంటనే గుర్తించకుంటే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.
మొదటగా, ఆవకాయ తిందామని జాడీ తీశారు. ఎంత ట్రై చేసినా ఆ మూత తెరుచుకోవట్లేదు. ఆఖరికి దాన్ని తీసి పక్కన పెట్టి ఆవకాయ వేసుకోవడం మానేసారు. ఇక్కడ ఆ మూత తెర్చుకోవడం ఇంపార్టెంట్ కాకపోయినా, దాన్ని తెరవడానికి మీరు చేసే ప్రయత్నం ముఖ్యమైనది. వద్దులే అని ఆపేస్తున్నారంటే మీ వయసు పెరుగుతున్నట్టే లెక్క.
మీకు బాగా ఇష్టమైన ప్యాంటు నడుము భాగంలో టైట్ గా ఉండి కాలి కింది వరకూ లూజ్ గా ఉండడం.
చర్మానికి ఎప్పటికప్పుడు లోషన్ రాస్తూ ఉండడం. చర్మ సమస్యలు వస్తాయేమోనన్న భయం కారణంగా అన్ని రకాల సాధనాలు వాడడం. చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి కసరత్తులు చేయడం.
చిన్నపిల్లల్లా నిద్రపోవాలని ప్రయత్నించినప్పటికీ, మధ్య మధ్యలో మెళకువ రావడం వయసు పెరిగినట్టుగా కనిపించడానికి కారకంగా నిలుస్తుంది.
మీ ముఖభాగంలో చర్మం దళసరిగా మారడం, మొదలగు సమస్యలు వయసు పెరుగుతున్నట్టుగా కనిపిస్తాయి. అందుకే పొగ తాగడం వంటి వాటిని మానేయాలి.
మీ బయటకి వెళ్ళినపుడు చాలా మంది మీ ఏజ్ ఎక్కువగా భావించడం. మీ నిజమైన వయసు కంటే ఎక్కువ ఉన్నట్టు వారు ఫీల్ అవడం.
ప్రతీ ఒక్కరూ తొందరగా రెడీ అవ్వమని చెప్పడం, ఎక్కడికైనా వెళ్ళడానికి అందరికంటే ఆలస్యంగా తయారవడం.
మెట్లు ఎక్కడానికి కష్టపడడం. పెద్ద చెట్టు ఎక్కుతున్నట్టు ఫీల్ అవడం. మొదలగు సమస్యలు మీకున్నాయంటే వయసు పెరుగుతున్నట్లు గుర్తించాలి.
మీరు మహిళలయితే రుతుక్రమం క్రమంగా జరగకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
ఇలాంటి లక్షణాలు మీలో కనిపించినపుడు వెంతనే జాగ్రత్తలు తీసుకోవాలి.