తప్పని తెలిసి కూడా చేస్తున్న పనులే విజయానికి దూరం తీసుకెళ్తున్నాయని తెలుసా?

-

విజయం కావాలని అందరికీ ఉంటుంది. కానీ అది అందరికీ దక్కదు. కొందరు మాత్రమే విజయ తీరాలకు చేరుకుని అక్కడి గాలిని ఆస్వాదించగలుగుతారు. కొందరికి సాధ్యమైన పని అందరూ ఎందుకు చేయలేకపోతున్నారనేది ప్రశ్న. మనం రోజూ చేసే పనులే మనల్ని విజయ తీరాలకి చేర్చకుండా ఆపుతున్నాయి. అవును.. తప్పని తెలిసి కూడా కొన్ని పనులు చేస్తుంటాము. అలాంటి పనులేంటో ఇక్కడ చూద్దాం.

Key to success

రోజూ పొద్దున్నే ఐదు గంటలకి లేవాలని రోజూ అనుకుంటాం. రోజూ మర్చిపోతాం. రాత్రిపూట ఎక్కువ సేపు మొబైల్ పట్టుకుని ఛాటింగ్ లో మునిగిపోతాం. అందువల్ల పొద్దున్న లేవడానికి కుదరకుండా పోతుంది. ఇది తప్పే కానీ మార్చుకోలేం.

వ్యాయామం చేయాలనీ, బరువు పెరిగిపోతున్నామని బాధపడుతుంటాం. రేపటి నుండి ఇలా ఉండదనుకుంటూ, మారిపోదాం అని చెప్పి శపథాలు చేస్తాం కానీ, చివరికి వచ్చేసరికి మళ్ళీ ఎప్పటిలాగే ఉంటాం.

మన జీవితంలో మనకి అడ్డొచ్చే చాలా వాటిని పక్కన పెట్టేయడం కష్టమైపోతుంది. పిచ్చాపాటీ కబుర్లు పెట్టే స్నేహితులు, ఊరికే సమయం వేస్ట్ చేసే వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. వారందరినీ తప్పించుకోవాలంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఆ కబుర్లన్నీ మానేస్తే బానే ఉంటుంది. కానీ మానలేం.

ఇంకా సిగరెట్, మందు అలవాట్లున్న వారి సంగతి చెప్పాల్సిన పనిలేదు. పని మీద దృష్టి నిలపకపోవడానికి ముఖ్య కారణాల్లో మందు తాగడం, పొగ తాగడం ప్రధానమైన కారణాలు. తాగిన ప్రతీ ఒక్కరూ ఇలాగే ఉంటారని కాదు. కానీ అతిగా తాగి కంట్రోల్ తప్పిన వాళ్ళు మాత్రం ఇలాగే ఉంటారు. చిత్రమేంటంటే ఇలా తాగిన ప్రతీ ఒక్కరూ మందు మానేయాలని అనుకుంటూనే ఉంటారు. కానీ మానరు.

మనం చేసే ఈ తప్పిదాలే మనల్ని విజయానికి తీసుకెళ్ళట్లేదు. వీటన్నింటినీ ఒక్కసారిగా మార్చుకోలేకపోయినా, మెల్ల మెల్లగా వీటి నుండి బయటపడవచ్చు. దాని కోసం కొత్త అలవాట్లని అలవర్చుకోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version