ముగిసిన మూడోరోజు ఆట…. భారీ స్కోర్ దిశగా ఇండియా …..

-

ఐదు టెస్టులలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది.తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశ‌గా దూసుకెళ్తుంది. స్టంప్స్ సమయానికి రెండో ఇన్నింగ్సులో భారత్ 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో గిల్(65*), కుల్డీ ప్(3*) యాదవ్ ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో రోహిత్ (19)తో పాటు రజత్ పాటీదార్ (0) విఫలమయ్యారు. అంతకు ముందు ఇంగ్లండ్ను 319రన్సు కట్టడి చేసిన ఇండియా ప్రస్తుతం 322 పరుగుల ఆదిక్యంలో ఉంది.

ఇక రెండో టెస్టులో డ‌బుల్ సెంచ‌రీతో చేసిన ఓపెనర్ య‌శ‌స్వీ రాజ్‌కోట్‌లోనూ చెలరేగి ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లో సిక్స‌ర్ల‌ వర్షం కురిపిస్తూ రెండో సెంచరీ కొట్టాడు. టీ20 త‌ర‌హాలో ఇంగ్లండ్ బౌల‌ర్ల‌న ఊచకోత కోశారు .మార్క్ వుడ్ బౌలింగ్‌లో ఫోర్ తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 122 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లో మూడో సెంచరీ చేశాడు.జైస్వాల్ (104*) సెంచరీతో చేసి…. రిటైర్డ్ హర్ట్ గా వెనిదిరిగాడు.

Read more RELATED
Recommended to you

Latest news