ఆ గుర్తుతో టిఆర్ఎస్ కు ఎన్నో కష్టాలు..!

-

సాధారణంగా ఎన్నికలు జరిగేటప్పుడు కొన్ని గుర్తులు ఒకే లాగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే . టిఆర్ఎస్ పార్టీకి ఇలా కొన్ని కొన్ని సార్లు కారు గుర్తును పోలిన గుర్తులు ఇండిపెండెంట్ అభ్యర్థులకు అధికారులు కేటాయించడంతో టిఆర్ఎస్ ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా ఇలా కారు గుర్తును పోలిన గుర్తు మరొకటి ఉండటంతోనే తమకు ఓట్లు తక్కువగా వచ్చాయని టిఆర్ఎస్ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇక టిఆర్ఎస్ ఎన్నికల గుర్తు అయినా కారు గుర్తును పోలిన గుర్తులతో తాము ఎన్నికల్లో ఎంతగానో నష్టపోతున్నామని.. ఇటీవలే టిఆర్ఎస్ పార్టీ నేతలందరూ ఆందోళన చెందుతున్నారు.

అయితే గతంలో నకిరేకల్ లో జరిగిన ఎన్నికల్లో ఇటీవల దుబ్బాక లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఇలా టీఆర్ఎస్ కార్ గుర్తు పోలిన గుర్తులు ఉండడంతో టిఆర్ఎస్ కు ఓటు వేయాలనుకునే ఎంతో మంది ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారని తద్వారా టిఆర్ఎస్ కు రావాల్సిన ఓట్లు ఇతరులకు వెళ్ళిపోతున్నాయి అని ఇటీవలే ఏకంగా ఈసీకి వెల్లడించారు. రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో అయినా అధికారులు ఈ విషయంలో కాస్త దృష్టి పెట్టి కారు గుర్తును పోలిన గుర్తులు రాకుండా చూడాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version