ఆధార్‌లో మార్పుల కోసమని తీసుకెళ్లి.. బాలికపై మేనమామ అత్యాచారం

-

కూతురిలా చూసుకోవాల్సిన అక్క కూతురిపై తన మేనమామే కన్నేశాడు. ఆధార్‌లో మార్పుల కోసం అని తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం..నిడదవోలు మండలంలోని ఓ హాస్టల్‌లో 9వ తరగతి చదువుతోంది.ఆమె తల్లి జాబ్ కోసం గల్ఫ్‌కి వెళ్లగా తండ్రి వేరుగా ఉంటున్నాడు.

దీంతో బాలిక బాగోగులను ఆమె అమ్మమ్మ చూసుకుంటోంది. ఈ క్రమంలోనే నవంబర్ 14న బాలిక వరుసకు మేనమామ అయ్యే కమల్‌కు రూ.100 ఇచ్చి ఆధార్‌లో మార్పులు చేయించాలని పంపింది. బాలిక ఉండే హాస్టల్‌కు వెళ్లిన కమల్ బైకు మీద ఆమెను ఎక్కించుకుని చాగల్లు మండలంలోని అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ టైంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండగా ఆమె అమ్మమ్మ ఆరా తీసింది. అసలు విషయం తెలుసుకుని నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రికి బాలికను తీసుకెళ్లారు. కూతురిపై అత్యాచారం జరిగిందని తెలుసుకున్న తండ్రి..శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version