రిపబ్లికన్ల చేతికి అమెరికా సెనెట్.. రిపబ్లికన్లకు 51..డెమోక్రట్లకు 42!

-

అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో ట్రంప్‌ నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ ఆ దేశ పార్లమెంట్ (ఎగువసభ) సెనెట్‌పై పట్టు సాధించింది. ఆ పార్టీకి మెజార్టీ స్థానాలు దక్కాయి. హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో సైతం ముందంజలో నిలిచింది. మొత్తం 100 సీట్లున్న సెనెట్‌లో 34 స్థానాలకు ఎన్నికలు జరగగా.. డెమోక్రట్లకు ఉన్న ఒక సీటు కూడా చేజారిపోయింది. తాజాగా రిపబ్లికన్లకు 51 మంది.. డెమోక్రట్లకు 42 మంది సభ్యులు ఉన్నారు. కాగా, మరో 7 స్థానాలకు ఫలితాలు వెలువడాల్సి ఉంది.

తాజా ఫలితాలతో ప్రభుత్వంలో కీలక అధికారుల నియామకం, సరికొత్త కార్యవర్గం ఎంపిక, సుప్రీంకోర్టు జడ్జి నియామకంలో రిపబ్లికన్ పార్టీ కీలకంగా వ్యవహరించనుంది. రానున్న రోజుల్లో ఇద్దరు సీనియర్‌ జడ్జిలు రిటైర్‌ కానుండటంతో ఈ ఫలితాలు రిపబ్లికన్లలో ఉత్సాహాన్ని నింపాయి. ఇక 435 స్థానాలున్న హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ (దిగువసభ)లో రిపబ్లికన్లకు 183 సీట్లు దక్కాయి. గతంతో పోలిస్తే ఒక స్థానం పెరిగింది. మరోవైపు డెమోక్రట్లు 154 స్థానాలను కైవసం చేసుకున్నారు. ట్రంప్‌కు ఈసారి సెనెట్ నుంచి పెద్దగా ఇబ్బందులు రాకపోవచ్చని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version