సర్పంతో సహజీవనం చేసిన మహిళ.. చనిపోయిన భర్తే పాములా వచ్చాడని వాదన

-

సాధారణంగా.. కుటుంబంలో ఎవరైనా చనిపోతే.. వారు మళ్లీ.. ఆ తర్వాత వారసత్వంగా పుట్టే బిడ్డరూపంలో వచ్చారని అనుకుంటారు. మనవడు లేదా మనవరాలి రూపంలో మళ్లీ పుట్టాడని పెద్దోళ్లు చెప్తుంటారు. కానీ ఓ మహిళ.. తన భర్త పాము రూపంలో మళ్లీ పుట్టాడని.. ఆ పాముతో కలిసి జీవిస్తుంది. పాములో భర్తను చూసుకుంటుంది. అసలు పామును చూస్తేనే.. ఎవరికైనా గుండెగుబేలు మంటుంది. ఈమె పోయి పోయి పామునే ఇంట్లో పెంచుకుంటుంది. ఇది చూసిన వారంతా.. ఆశ్చర్యానికి గురువతున్నారు. కర్నాటకలో జరిగిన ఈ వింత ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా బనహట్టి తాలుకా కులహళ్లి గ్రామంలో శారవ్వ కంబార అనే మహిళ ఉంటుంది. ఈమె వయసు 50-55 ఏళ్ల మధ్య ఉంటుంది. రెండేళ్ల క్రితమే ఆమె భర్త మోనేష్ అనారోగ్యం కారణంగా మరణించాడు. అప్పటి నుంచీ ఆమె ఒక్కతే.. ఒంటరిగా నివసిస్తోంది. ఐతే ఐదు రోజుల క్రితం శారవ్వ ఇంటికి ఓ పాము వచ్చింది. పామును చూసి శారవ మొదట భయటపడిపోయింది. కానీ పాము ఎలాంటి హాని తలపెట్టకుండా.. చాపపైనే కూర్చుంది. తనవైపే చూస్తుండడంతో శారవ్వ షాక్‌ అయింది. మరణించిన తన భర్త పునర్జన్మ ఎత్తాడని.. పాము రూపంలో తమ ఇంటికి తిరిగి వచ్చాడని ఆమె ఫిక్స్‌ అయింది. అప్పటి నుంచి ఆ పామును పెంచుకుంటోంది. ఈ విషయాన్ని ఇరుగుపొరుగు వారికి చెప్పలేదు. దాని ఆలనా పాలనా చూసుకోవడమే కాదు.. కబుర్లు కూడా చెప్పడం మొదలేసింది.
ఇటీవల పక్కింటి మహిళ శారవ్వ ఇంటికి వచ్చింది. ఇంట్లో చాపపై ఉన్న పామును చూసి ఆమెకు ఫీజులు ఎగిరిపోయాయ్‌…’శారవ్వా.. పాము.. పాము’.. అని కేకలు వేసింది. ‘భయపడకు.. అదీ ఏమీ చేయదని శారవ్వ చెప్పి…ఆ తర్వాత స్టోరీ మొత్తం చెప్పింది. చనిపోయిన తన భర్తే పాము రూపంలో వచ్చాడని చెప్పడంతో.. ఆ పక్కింటి మహిళ అవాక్కయింది. అవునా..అలాగా.. అనుకుంటూ.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. వెళ్లిన మహిళ ఊరికే ఉండదుగా.. ఇరుగుపొరుగు చెప్పి.విషయం మొత్తం వైరల్‌ చేసింది. అది కాస్తా..ఫారెస్ట్ అధికారుల వరకూ వెళ్లింది. వారు గ్రామానికి చేరుకొని పామును పట్టుకున్నారు. ఐతే ఆ పాను తన భర్త అని.. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టవదని శారవ్వ మొత్తుకుంది..అవన్నీ మూడఢనమ్మకాలను శారవ్వకు నచ్చచెప్పి…అనంతరం ఆ పామును సంచిలో తీసుకెళ్లి.. అడవిలో వదిలిపెట్టారు.
మొత్తానికి అలా జరిగింది.. ఇంతకీ ఆ పాము చనిపోయి శారవ్వ భర్త రూపంలో వచ్చిందంటారా.. లేకుంటే.. కాటేయకుండా కామ్‌గా.. శారవ్వ చెప్పే ముచ్చట్లు ఎందుకు వినింది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version