Malavath Purna: 7 ఖండాల్లోని 7 పర్వతాలను అధిరోహించిన తెలంగాణ ముద్దు బిడ్డ

-

తెలంగాణ ముద్దు బిడ్డ మలావత్ పూర్ణ మరో అరుదైన ఘనత సాధించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మలావత్ పూర్ణ ప్రపంచంలోని 7 ఖండాల్లో 7 పర్వత శిఖరాలను అధిరోహించింది. దీంతో మరోసారి తన పేరును చరిత్రలో సుస్థిరం చేసుకుంది. తాజాగా అలస్కా (అమెరికా) ప్రాంతంలోని డెనాలీ పర్వతాన్ని అధిరోహించింది. ఈ పర్వతం 6,190 అడుగుల ఎత్తులో ఉంది. మే 23వ తేదీన పర్వత యాత్రను ప్రారంభించిన పూర్ణ.. జూన్ 5వ తేదీన టార్గెట్ ఫినిష్ చేసింది. ఈ విషయంపై పూర్ణ కోచ్ శేఖర్ బాబు సంతోషం వ్యక్తం చేశారు.

మలావత్ పూర్ణ

కాగా, పూర్ణ 2014లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. 2016లో మౌంట్ కిలిమంజారో (ఆఫ్రికా), 2017లో మౌంట్ ఎల్బస్ (యూరప్), 2019లో మౌంట్ అకాన్‌కాగువా (దక్షిణ అమెరికా), 2019లో మౌంట్ కార్ట్స్ నెజ్ (ఓసియానియా), 2019లో విన్సన్ మాసిఫ్ (అంటార్కిటికా) పర్వత శిఖరాలను అధిరోహించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version