దేశంలోనే తొలి సోలోగమి వివాహం.. పెళ్లి చేసుకున్న క్షమా బిందు!!

-

ఇటీవల స్వీయ వివాహం చేసుకుంటానని చెప్పిన క్షమా బిందు వివాహం నేడు జరిగింది. ఆత్మీయుల సమక్షంలో.. వేదమంత్రాల నడుమ క్షమా బిందు పెళ్లి చేసుకుంది. సంప్రదాయ బద్ధంగా ఆమె పెళ్లి జరిగింది. అందరూ ఉన్నారు కానీ.. ఒక్క వరుడు మాత్రమే లేడు. వరుడు లేకుండానే పెళ్లి చేసుకుంటానని క్షమాబిందు మొదట్లోనే చెప్పింది. ఈ మేరకు ఒంటరి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.

క్షమా బిందు

గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమా బిందు (24 ఏళ్లు) సోలోగమి వివాహం చేసుకుంటానని చెప్పి.. ఇటీవల వార్తల్లోకి ఎక్కింది. ఈ మేరకు జూన్ 11వ తేదీన గోత్రిలోని ఓ ఆలయంలో వివాహం చేసుకునేందుకు డేట్ కూడా ఫిక్స్ అయింది. కానీ ఆమె వివాహం వివాదాస్పదమైంది. కొందరు రాజకీయ నేతలు ఆమె వివాహాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆమె పెళ్లి రెండు రోజుల కంటే ముందే సన్నిహితుల సమక్షంలో నేడు జరిగింది. హల్దీ, మెహందీ వేడుకలు, వేదమంత్రాలతో ఏడడుగులు కూడా వేసింది. తనకు తానే సింధూరం రాసుకుని వివాహితగా మారింది. దీంతో దేశంలోనే తొలి సోలోగమి వివాహంగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version