తరం మారింది.. ఈ కాలం యువత పెద్దగా పట్టించుకోని విషయాలివే..

-

ప్రతీ ముఫ్ఫై సంవత్సరాలకి తరం మారుతుంది. అప్పటివరకు యువకులుగా ఉన్నవారికి బాధ్యతలు వచ్చి మీద పడుతుంటాయి. పిల్లలుగా ఉన్నవారు యువకులుగా మారి, లోకమంతా తమదే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. యాభై దాటినవారికి ఇంకా కొంత కాలమే ఇక్కడ మనకి ప్లేస్ ఉంటుందన్న భయం వచ్చేస్తుంది. ఇక టెక్నాలజీ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఏ క్షణం ఏది పుట్టుకొస్తుందో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. అంతకుముందు అసాధ్యం అనుకున్న అన్ని పనులు ఇప్పుడు సాధ్యం అయిపోయాయి. ఇప్పుడు అసాధ్యం అనుకున్న చాలా విషయాలు రేపు సాధ్యం కావచ్చు.

ఐతే ఈ తరం యువకుల్లో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఇంతకుముందు వారిలా కాకుండా కాలంలో పాటు మారుతూ కొత్త పుంతలు తొక్కుతున్నారు. అలాంటి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలేంటో ఇక్కడ చూద్దాం.

ప్రేమ:

ఇప్పటి యువత ప్రేమని పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదు. రిలేషన్ షిప్స్ ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇంకా, ఒకరితో విడిపోయాక మరొకరితో ఈజీగా ప్రేమలో పడిపోతున్నారు. అది తప్పా కాదా అన్నది పక్కన పెడితే, ప్రేమ మీద పెద్దగా పట్టింపు లేదనే చెప్పాలి.

పగ ప్రతీకారం :

ఏదైనా మాటంటే పగ తీర్చుకోవాలి వాడిని ఇది చేయాలి అది చేయాలి అనే కాలం పోయింది. ఒకరితో గొడవ పెట్టుకున్నా మళ్ళీ వారితో అవసరం ఉంటే కలిసిపోతున్నారు. అదే ఇంతకుముందైతే చిన్న్న గొడవ జరిగినా, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి చాలా రోజులు పడుతుండేది.

హ్యాపీనెస్:

తప్పక ఉద్యోగం చేస్తూ ఒత్తిడి ఎదుర్కొనే వారిని వదిలేస్తే, చాలా మంది సంతోషం కోస బ్రతుకుతున్నారు. అన్ని పనులు మీదేసుకుని భూమిలోపలికి దిగిపోయేంత ఒత్తిడి తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడడం లేదు.

కొత్త కొత్త ఆవిష్కరణలు:

సోషల్ మీడియా వల్ల ప్రపంచ దేశాల ప్రజలతో బంధం ఏర్పడటం వల్ల కొత్త కొత్త ఆవిష్కరణలకి తెరలేపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version