ఇడియట్ అంటే వెదవ అని అర్థమైపోతుంది. టైటిల్‌గా లోఫర్ అని పెడితే పనికిరానివాడని అర్థం. కానీ.. విజయ్‌దేవరకొండ సినిమాకు పెట్టిన టైటిల్‌కు మీనింగ్ తెలియాలంటే.. గూగుల్‌నే నమ్ముకోవాలి. మీనింగ్ అందరికీ తెలీకపోయినా.. మరోసారి డిఫరెంట్ టైటిల్‌తో వచ్చాడు పూరీ. ఇంతకీ.. విజయ్ దేవరకొండకు పెట్టిన పవర్‌ఫుల్ టైటిల్ ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ కు కారణమైంది.
లైగర్ టైటిల్‌తోపాటు.. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. వెనకాల బ్యాక్‌డ్రాప్‌లో టైటిల్‌కు తగ్గట్టు సగంసింహం.. సగం పులి కనిపించాయి. హీరో బాక్సింగ్ స్టిల్లో వున్నాడు. మగ సింహం, ఆడ పులి సంతానాన్ని లైగర్ అంటారు. ఇది సింహం, పులి కన్నా చాలా పెద్దగా వుంటూ.. సింహంలానే గర్జిస్తుంది. ఇది అర్థం కావడానికి ‘సాలా క్రాస్‌బ్రీడ్’ అన్న ట్యాగ్‌లైన్ పెట్టాడు పూరీ.
అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్ కబీర్‌సింగ్ 300 కోట్లు కలెక్ట్ చేసింది. కబీర్‌సింగ్ ఒరిజినల్ వెర్షన్ హీరోగా విజయ్‌కు సౌత్‌లో గుర్తింపు వుంది. లైగర్‌తో విజయ్ పాన్ ఇండియాలోకి అడుగు పెడుతూ మార్కెట్ పెంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరీతోపాటు.. కరణ్ జోహార్.. అపూర్వ మెహతా కలిసి నిర్మిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్ కాగా.. లాక్‌డౌన్ తర్వాత లైగర్ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తారట.