గుజరాత్ రాజ్‌కోట్‌లో ఓ ఘరానా దొంగ పీపీఈ సూట్ ధరించి మరీ దొంగతనానికి పాల్పడ్డాడు. కరోనా విజృంభిస్తున్న వేళ చాలా ముందు జాగ్రత్త తీసుకున్నాడు. మాండ్వి చౌక్ సమీపంలోని జైన డేరాసర్లో ప్రవేశించి… సుమారు రూ.40 వేలు వరకు దొంగింలించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కరోనా విజృంభిస్తున్న వేళ ఓ ఘరానా దొంగ… పకడ్బందీగా దొంగతనానికి పాల్పడ్డాడు. పీపీఈ సూట్ ధరించి మరీ గుజరాత్ రాజ్‌కోట్‌లో… మాండ్వి చౌక్ సమీపంలోని జైన డేరాసర్లో ప్రవేశించాడు. అక్కడ ఉన్న హుండీ నుంచి సుమారు రూ.35,000 నుంచి రూ.40,000 వరకు అపహరించాడు. ఈ మొత్తం ఘటన అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. డేరాసర్ నిర్వహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.