ఆక్రమణల తొలగింపు పేరుతో ఏకపక్ష కూల్చివేతలు సరికాదని, అధికారులు పేదలను ఇబ్బంది పెడుతున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి ఫైర్ అయ్యారు. రోజూవారి వ్యాపారాలు చేసుకునే పేదలను అధికారులు కూల్చివేతల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని వెల్లడించారు.ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే వివరించారు.
రోజువారి వ్యాపారం చేసుకుంటేనే పేదల జీవనం గడుస్తుందని, వారి జీవనం మీద దెబ్బకొడితే ఎలా అని ప్రశ్నించారు. పేద వ్యాపారుల శాపనార్థాలు ప్రభుత్వానికి మంచిది కాదన్నారు.గత ప్రభుత్వాలు వారి పట్ల మానవీయ కోణంలో వ్యహరించాయన్నారు. ఇరుకు రోడ్లు ఉన్న చోట ఆక్రమణల తొలగించాలని, ప్రభుత్వం చెబితే అధికారులు మాత్రం వారికి తోచిన చోట అడ్డగోలుగా కూల్చివేతలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.