ఏ అంశం అయినా కూర్చుని పరిష్కరించుకోవాలన్నదే తమ విధానం :మంత్రి బొత్స

-

నేడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్రస్థాయి ప్రథమ మహా జనసభకు మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ….ఏ అంశం అయినా కూర్చుని పరిష్కరించుకోవాలన్నదే తన విధానం అని స్పష్టం చేశారు. అయితే తమ ప్రభుత్వంలో ఆ ఇబ్బంది లేదని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ఉద్యోగులు, సీఎం తలదించుకునే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి వ్యతిరేకత లేదని బొత్స అన్నారు.

ప్రభుత్వంలో అవినీతి జరిగితే ఉద్యోగులు, ముఖ్యమంత్రి తలదించుకోవాల్సి ఉంటుందని అన్నారు. సర్వీస్ రూల్స్ సహా ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఉద్యోగులకు సూచించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను జీఓఎంలో చర్చించి పరిష్కరిస్తామని బొత్స హామీ ఇచ్చారు. అవసరమైతే కాళ్లు పట్టుకుని అయినా సమస్య పరిష్కరించుకునే నేర్పు ఉద్యోగ సంఘాలకు ఉండాలని అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారంలో సామ, దాన, భేద, దండోపాయాలు సహజమేనని అన్నారు. అయితే ఉద్యోగ సంఘాలు నేరుగా దండోపాయాన్ని అవలంబించడం సరికాదని హితవు పలికారు. సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ అండగా ఉంటుందని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version