అప్పుడు జగపతిబాబు ఇప్పుడు రాజమౌళి అదే కులం గోల..

-

దాదాపు అన్ని రంగాల్లో కులం పై ఏదో ఒక రకంగా చర్చ నడుస్తూనే వస్తుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఇది మరింత ఎక్కువగా ఉందని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. అవకాశాలు రావాలన్న సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అన్నా కచ్చితంగా కులం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది అని కొందరి అభిప్రాయం. అయితే తాజాగా ఈ విషయంపై జగపతిబాబు మాట్లాడిన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయం వైరల్ గా మారింది. అయితే మళ్లీ ఇదే విషయంపై దర్శకుడు రాజమౌళి మాట్లాడి చర్చకు దారి తీశారు..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జగపతిబాబు కులంపై వైరల్ కామెంట్స్ చేశారు. ఇంట్లో పని చేసే పనిమనిషి ఏ కులం అనేది అవసరం లేదు.. ఆడదాని దగ్గర పడుకునేందుకు కులం అవసరం లేదు.. కానీ పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి కులం అవసరం.. నా పెద్ద కుమార్తె ఒక విదేశీ యువకుడిని పెద్ద చేసుకునే క్రమంలో కొందరు కుల పెద్దలు బెదిరింపులకు దిగారు నాకే లేని బాధ వీళ్ళందరికీ ఎందుకో అర్థం కాదు అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలు మరవకముందే దర్శకధీరుడు రాజమౌళి కులం విషయాన్ని ప్రస్తావించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది..

అసలు విషయం ఏంటంటే భారతదేశంలోని కుల వ్యవస్థ గురించి ప్రముఖ హాలీవుడ్ మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన రాజమౌళి..”నా కుటుంబ సభ్యులు కుల వ్యవస్థకు వ్యతిరేకం. నిజానికి నా కాలేజీకి వెళ్లే వరకు నా కులం ఏమిటో కూడా నాకు తెలియదు. నా దరఖాస్తు ఫారమ్ నింపడానికి మా నాన్నగారు వచ్చారు. కులం గురించి అందులో ఒక కాలమ్ కూడా ఉంది. నాన్న దానిని పూరించడానికి నిరాకరించాడు. కుల వ్యవస్థ గురించి నాకు మొదటిసారి అప్పుడే తెలిసింది.. అంటూ సమాధానం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version