దక్షిణాఫ్రికా దేశంలో పురుడు పోసుకున్న.. ఒమిక్రాన్ వేరియంట్… క్రమంగా క్రమంగా విస్తరిస్తుంది. ఇప్పటి కే ఈ ఒమిక్రాన్ వేరియంట్.. 70 కి పైగా దేశాలకు విస్తరించింది. అయితే.. ఈ వేరియంట్ మన ఇండియాను కూడా కలిచి వేస్తుంది. భారత దేశంలో ఇప్పటి వరకు 11 రాష్ట్రాలకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి లవ్ అగర్వాల్ కాసేపటి క్రితమే ప్రకటన చేశారు.
భారత దేశం లో ఇప్పటి వరకు 101 కి ఒమిక్రాన్ కేసులు చేరినట్లు ఆయన వివరించారు. మహా రాష్ట్ర లో 32 కేసులు, ఢిల్లీలో 22 కేసులు, రాజస్థాన్‌లో 17 కేసులు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రల లో 8 కేసులు నమోదు అయినట్లు లవ్ అగర్వాల్ ప్రకటన చేశారు. ఇక అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్లు వివరించారు. ఈ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యం లో.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా అందరూ మాస్కులు ధరించాలని కోరారు.