అన్నీ ఉన్నా, అల్లుడు నోట్లో శని ఉంటే ఎంత వచ్చిన కనిపించదు అంటారు. అలా కొంత మందికి ఎంత కష్టపడి సంపాదించిన కూడా చేతిలో పెద్దగా డబ్బులు ఉండవు. అనుకున్న పనులు సరిగ్గా జరగవు..ఎంత కష్టపడిన సరైన ప్రయోజనాలు ఉండవు. అందుకే ఇంటికి వాస్తు దోషం, నర దిష్టి ఉంటాయని పెద్దలు అంటారు.వాస్తు శాస్త్రాన్ని నమ్ముకున్న వాళ్ళు అయితే ఏదొక విషయం పై చింతిస్తూ ఉంటారు.ఇంట్లో ఏదో వాస్తు దోషం ఉంది, అందుకే డబ్బు ఊరికే ఖర్చు అయిపోతుంది అని ఆందోళన పడుతూ ఉంటారు.
లక్ష్మీదేవి కటాక్షం స్థిరంగా ఉండాలంటే ఈ వాస్తు టిప్ ఫాలో అవడం బెటర్ అంటున్నారు వాస్తు నిపుణులు. కుబేర యంత్రాన్ని ఓ చోట పెట్టడం వలన స్థిర లక్ష్మి ఉంటుందని చెబుతున్నారు. ఇంట్లో అల్మారా లేదా వాల్ట్ లో మనం ఎక్కువగా బట్టలు, విలువైన వస్తువులు మాత్రమే పెడుతూ ఉంటాము. డబ్బు కూడా దాచుకుంటాము. వీటితోపాటు కుబేర యంత్రాన్ని గనుక అల్మారా లేదా వాల్ట్ లో పెట్టినట్లైతే డబ్బుకు లోటు ఉండదంటున్నారు వాస్తు నిపుణులు..
ఈ కుబేర యంత్రాన్ని మనం ఇంట్లో ఉంచితే మాత్రం అన్నీ శుభాలు కలుగుతాయని అందరు అంటున్నారు.అందుకే మనకు నమ్మకం ఉన్నా లేకున్నా కూడా ఈ యంత్రాన్ని పెట్టుకుంటే కాస్త మనసు స్థిరంగా ఉంటుందని పెద్దలు చెబుతుంటారు.. కుబేర యంత్రం చాలా ప్రభావవంతమైనదని, ఇది ఇంట్లో ఉండడం వల్ల ఆనందం, శ్రేయస్సు నెలకొంటుందని చెబుతున్నారు. లక్ష్మీ కటాక్షం స్థిరంగా ఉంటుందంటున్నారు వాస్తు నిపునులు అంటున్నారు..