అల్లం వల్ల ఎన్నో లాభాలు.. కానీ అధికంగా వాడటం వల్ల అన్నే నష్టాలు

-

వంటల్లో అల్లం వేస్తే.. వచ్చే.. సువాసన, రుచి చాలా బాగుంటుంది. మసాల కూరల్లో అయితే అల్లం, వెల్లుల్లి పేస్ట్ లేకుండా..అసలు వండలేము కూడా. అల్లం ఒక ఔషధం అని చాలామంది చెప్తుంటారు. వీటిని వాడటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అంటారు. అయితే అల్లం వాడటం వల్ల లాభాలు ఉన్నప్పటికీ అతిగా ఉపయోగించడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ఈరోజు మనం అల్లం వాడకం ఎంత వరకూ మంచిది, ఎలాంటి లాభాలు ఉన్నాయి, అతిగా వాడితే ఎలాంటి నష్టాలు వస్తాయి అనేది చూద్దాం.

అల్లంలో జింజరాల్స్ అనే కెమికల్స్ ఉంటాయి. వాటివల్లే అల్లానికి ఆ స్మెల్, టేస్ట్ వస్తుంది. అల్లం పవర్ ఫుల్ యాంటీ ఇన్ఫ్లమెంటరీగా పనిచేస్తుంది. బాడీలో ఉండే వ్యర్థాలను తొలగించడానికి అల్లంలో ఉన్న జింజారాల్స్ అనే కెమికల్ చక్కగా ఉపయోగపడతుంది.

అల్లం వాడకం వల్ల లాభాలు..

ఆహారాన్ని అరగించడానికి కావాల్సిన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ను, ఎంజైమ్స్ ఉత్పత్తిని అల్లం పెంచుతుంది. పొట్టలో ప్రేగుల్లో ఉన్న ఆహారం త్వరగా జరిగి.. ఖాళీ అయ్యేట్లు చేస్తుంది. ఆహారపదార్థాలు అరగడానికి, జరగడానికి, జీర్ణక్రియ మెరుగుపరచడానికి అల్లం ఉపయోగపడుతుందని.. 2011వ సంవత్సంరలో థైవాన్ వారు పరిశోధన చేసి ఈ విషయాలను స్పష్టం చేశారు.

కొందరికి ఉదయం వాంతింగ్ సెన్సేసేషన్ ఎక్కువగా ఉంటుంది. గర్భవతుల్లో ఇది ఎక్కువ. అలాంటివి వారు.. అల్లం రసం తేనె తీసుకుని నాకితే వికారం, వాంతులు తగ్గుతాయి.

అల్లం మలం ప్రేగు క్యాన్సర్ రాకుండా 50 శాతం రక్షిస్తుందని 2011వ సంవత్సరంలో అమెరికా వారు అల్లం మీద పరిశోధన చేసి ఈ విషయం కనుగొన్నారు.

ఇంకా మోకాళ్ల నొప్పులు, మజిల్ పెయిన్స్ ఉన్నవారికి కూడా అల్లం బాగా ఉపయోగపడుతుందని.. అల్లం రెండు ముక్కలు తీసుకుని నీళ్లల్లో వేసి మరిగించి.. హెర్బల్ టీ తాగినట్లు తాగొచ్చు.. ఇలా తాగడం వల్ల పెయిన్ కిల్లర్ లా పనిచేసి నొప్పులను తగ్గిస్తుందట.

ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తుందట. డయబెటీస్ రావడానికి ప్రధాన కారణం.. ఇన్సులిన్ నిరోధకత..రోజుకు రెండుమూడు గ్రాముల చొప్పున తీసుకుంటే….ఇన్సులిన్ రిసెస్టెన్స్ తగ్గుతుందని ఇరాన్ వారు అల్లం మీద పరిశోధన చేసి నిరూపించారు.

అల్లంను ఎండపెట్టి..సొంటిపొడి చేసి..నెయ్యి కలిపి ముద్దలా చేసుకుని తింటే.. ఆకలిలేమిని తగ్గిస్తుంది.

అల్లం వల్ల ఇన్ని ఉపయోగాలు..బాగా వాడుకోవచ్చు.. కానీ తగిన మోతాదులో వాడినప్పుడే లాభాలు ఉంటాయి. ఎక్కువ వాడితే నష్టాలు కూడా ఉన్నాయి.

అల్లం అధికంగా వాడటం వల్ల వచ్చే నష్టాలు :

అల్లం ఎక్కువ తీసుకుంటే.. హైడ్రో క్లోరిక్ యాసిడ్స్ ను గ్యాసెస్ ను ఎక్కువ రిలీజ్ చేస్తాయి. అవసరానికి మించి స్టిమ్యులేట్ చేస్తాయి. ఇవి ఎక్కువ రిలీజ్ అయితే.. యాసిడిటీ, మంటలు రావడం, పైకి ఎగతన్నిన్నట్లు ఉండటం, పొట్టప్రేగుల్లో ఇబ్బంది ఉంటుంది. అందుకే మొదటినుంచే అల్లం వాడే కొన్ని కూరగాయలను మన పేద్దోళ్లు మనకు పరిచయం చేశారు.. బంగాళదుంప, కంద, గుమ్మడికాయ, మాంసాహారాలు ఇవి త్వరగా అరగవు.. అందుకే వీటిల్లో అల్లం వేసి వండే కాన్సప్ట్ తెచ్చారు. అన్నింటిలో అల్లం వేయొద్దు. అవసరానికి తగ్గట్టు వాడుకుంటే చాలు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version