పక్కనోళ్ల సినిమా ఫ్లాప్ కావాలని కోరుకునే వాళ్ళు టాలీవుడ్ లో ఉన్నారు: అలీ సంచలన వ్యాఖ్యలు

-

పక్కనోళ్ల సినిమా ఫ్లాప్ కావాలని కోరుకునే జనాలు టాలీవుడ్ లో ఉన్నారని సినిమా నటుడు అలీ అన్నారు. ఒక సినిమా ఫ్లాప్ ఐతే ఇంకో సినిమా వాళ్ళు చంకలు గుద్దుకోవడం ఏమిటో అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ధోరణి చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. ఇలాంటి దురాలోచనలు మానుకోవాలని అన్నారు. పక్కన వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటేనే.. అంతకు మించిన మంచి మీకు కూడా జరుగుతుందని చెప్పారు. బాగున్న సినిమాను కూడా బాగోలేదు అని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని అలీ మండిపడ్డారు.

అలా ప్రచారం చేస్తున్న వాళ్లు కూడా ఇండస్ట్రీ లోనే ఉన్నాము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. గతంలో చెన్నైలో తెలుగు ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఉండేవి కాదని అన్నారు.ఇక ఎఫ్ 3 సినిమా కు నిన్న కూడా హౌస్ ఫుల్ కలెక్షన్ వచ్చాయని..ఆ విషయం తెలిసిన నటులుగా తామంతా సంతోషించాము అని చెప్పారు.మరోపక్క ఇదే రకమైన విమర్శలను దర్శకుడు అనిల్ రావిపూడి కూడా చేశారు.కొందరు పనిగట్టుకుని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version