తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈనెల 3న కేబినెట్ విస్తరణ ఉంటుందని గత వారం రోజులుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఉగాది నాడు సీఎం రేవంత్ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి కేబినెట్ విస్తరణకు టైం ఫిక్స్ చేశారని, అందుకే మంత్రుల ప్రమాణం కోసం ఏర్పాట్లకు సంబంధించి చర్చలు జరపారని టాక్ నడిచింది.
అయితే, నేడు ఢిల్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నట్లు సమాచారం. సామాజిక వర్గాలు, జిల్లాల ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ కూర్పు ఉంటుందని సమాచారం. అయితే, ఆశావహులు తమకు చాన్స్ ఇవ్వాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలు సైతం తమకు చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.వీటిన్నింటిపై ఏకాభిప్రాయం రాకపోతే మరోసారి కేబినెట్ విస్తరణ వాయిదా పడే చాన్స్ లేకపోలేదని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.