జలుబుకి మందు ఎందుకు కనుక్కోలేకపోతున్నారు… అసలు సాధ్యం కాదా…?

-

జలుబు చేసిందా…? అయితే చీదుకోవడం, పీల్చుకోవడమే… మరి మందులు…? మందులు వేస్తే ఏడు రోజుల్లో వేయకపోతే వారం రోజుల్లో తగ్గుతుంది… అంటే…? అది తగ్గాలి అనుకున్నప్పుడు తగ్గుతుంది గాని నువ్వు తగ్గాలి అనుకున్నప్పుడు తగ్గదు… అది కూడా ఒక అనుభవమే… భరించు… జలుబు గురించి చాలా మంది చెప్పే మాటలు ఇవే… వాస్తవాలు ఇబ్బంది గా ఉన్నా జలుబు మాత్రం జనాలకు ఆ విధంగానే చుక్కలు చూపిస్తూ ఉంటుంది. దీనికి ఆస్పత్రికి వెళ్ళినా, మందుల దుకాణానికి వెళ్ళినా ఎక్కడకు వెళ్ళినా సరే,

ఫలితం మాత్రం ఉండదు అనేది అందరికి తెలిసిన వాస్తవమే. అందుకే ఎయిడ్స్ కి అయినా మందు ఉంటుంది గాని జలుబుకి మందు ఉండదు అంటారు… ఒక్కసారి జలుబు చేసింది అంటే అది తగ్గే వరకు నరకమే, దానికి తోడు ఇది పక్కని వారికి వ్యాపిస్తూ మరింత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి జలుబుకి మందు లేదా…? కాదు ఆ ప్రశ్నకు సమాధానమే లేదని అంటున్నారు వైద్యులు, పరిశీలకులు. అసలు సాధ్యం కాని దానికి మందు కనిపెట్టడం అంటున్నారు. వాస్తవానికి జలుబు చేయడానికి 350 రకాల వైరస్‌, బ్యాక్టీరియాలు కారణమట.

వీటికి మందు తయారు చేయడం కూడా సాధ్యం కాని పని… దానికి ప్రధాన కారణం ఏంటి అంటే… ఈ వైరస్‌, బ్యాక్టీరియాలు ప్రతీ ఏడాది… తమ స్వరూప స్వభావాలను మార్చుకోవడంతో ఈ సంవత్సరం తయారు చేసిన ఒక మందు మరుసటి సంవత్సరం పనికి రాదు. దీనితో జండు బాం, విక్స్ వంటి తాత్కాలిక ఉపశామనాలే మినహా జలుబు తగ్గడానికి మార్గాలే లేవనే వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఆ వైరస్‌, బ్యాక్టీరియాను అంతమొందించే మందులను ఎవరూ తయారు చేసే సాహసం కూడా ఎవరూ చేయడం లేదని అంటున్నారు. కాబట్టి జలుబు రాకుండా జాగ్రత్త పడ౦డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version