దేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని హీరో సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తిరుమల లడ్డూ వివాదంపై యాంకర్ అడిగిన ప్రశ్నకు హీరో సుమన్ ఘాటుగా స్పందించారు. ఈ దేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. లడ్డూ కల్తీ వేరు..సనాతన ధర్మం వేరు అని చెప్పారు.
సనాతన ధర్మం అర్థం తెలియాలంటే గూగుల్ చేసుకోండని సూటిగా వెల్లడించారు.
హిందువుల రక్షణ కోసం పార్లమెంటులో ప్రత్యేక చట్టం చేయాలన్నారు. తాను సెకులరిస్టునని అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు. అందుకోసమే ప్రతీ రిలీజియన్ రక్షణ కోసం పార్లమెంటులో ప్రత్యేక బిల్ తీసుకుని రావాలన్నారు. తాను ఒక్క హిందువులకే సపోర్టు చేయడంలేదని, అందరూ నన్ను ఆదరిస్తేనే ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఒక మతం వారు పరమతాన్ని గౌరవించాలని తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై హీరో సుమన్ పై విధంగా స్పందించారు.