రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు – చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగం పెరిగిపోతుందని.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికలలో బుద్ధి చెప్పి.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 2014లో అధికారంలోకి వచ్చాక అనేక సవాళ్లను అధిగమించి ఏపీకి పెట్టుబడును తీసుకువచ్చామన్నారు చంద్రబాబు. కానీ నేడు వైసీపీ ప్రభుత్వ వైఖరితో పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచిపోయాయని విమర్శించారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ఎమ్మెల్సీ పట్టబద్రుల ఎన్నికలలో పిడిఎఫ్ తో అవగాహన చేసుకున్నట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వం హక్కులను కాలరాస్తూ తమను ఎలా మోసం చేసిందో ఉద్యోగులు, టీచర్లు గుర్తించి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. నాడు విభజన కష్టాలు ఉన్న ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చామన్నారు. నేడు ప్రభుత్వ ఉద్యోగులకు అడిగినంత ఫిట్మెంట్ కాదు కదా.. కనీసం ఏ నెల జీతం ఆ నెల ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. టీచర్లకు లిక్కర్ షాపుల వద్ద డ్యూటీలు వేసిన ఈ ప్రభుత్వానికి టీచర్లు బుద్ధి చెప్పాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version