దమ్కీలకు భయపడేది లేదు.. వారికి పవన్ వార్నింగ్..!

-

దమ్కీలకు ఎట్టి పరిస్థితిలో కూడా భయపడేది లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా మహాయతి కూటమి గెలుపు కోసం డెగ్లూర్ లో NDA తరుపున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ నడిచిన నేలపై తాము ఎవ్వరికీ భయపడేది లేదన్నారు. సనాతన ధర్మ పరిరక్షణే జనసేన లక్ష్యమని పేర్కొన్నారు.

Deputy CM Pawan
Deputy CM Pawan

సినిమాల్లో పోరాటాలు చేయడం, గొడవ పెట్టడం చాలా ఈజీ అని.. నిజ జీవితంలో ధర్మం కోసం కొట్లాడటం నిలబడటం చాలా కష్టమని తెలిపారు. దేశంలో ప్రతీ హిందువు గుండెలో రామనామం లేకుండా ఉండదని అన్నారు. హిందువులంతా ఏకమైతే.. హైదరాబాద్ నుంచి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు వచ్చే వాళ్లు ఎంత అంటూ ఒవైసీ సోదరులనుద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ నడిచిన నేలలో ఎలాంటి దమ్కీలకు భయపడేది లేదని మజ్లిస్ పార్టీ నేతతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version