వాహనదారులకు బిగ్ షాక్..హైదరాబాద్ లోని పలు బంకుల్లో పెట్రోల్ కొరత

-

హైదరాబాద్ లోని వాహనదారులకు బిగ్ షాక్. పెట్రోల్ దొరుకక హైదరాబాద్ లోని వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు బంకుల్లో పెట్రోల్ కొరత చోటు చేసుకుంది. దీంతో వాహనదారులను బంకు యాజమాన్యాలు..వెనక్కి పంపుతున్నారు.

అయితే.. వాహనాలు తోయలేక రోడ్డు పక్కన పార్క్ చేసి ఆఫీసులకు వెళ్లిపోతున్నారు వాహనదారులు. అటు కొంత మంది పెట్రోలు స్టాక్‌ ఎందుకు పెట్టుకోలేదని.. ఇందులో ప్రభుత్వం వైఫల్యం ఉందని మండిపడుతున్నారు. రేపటి వరకు పెట్రోల్‌ స్టాక్‌ పెరుగుతుందని ఆయిల్‌ కంపెనీలు చెబుతున్నాయి. అయితే… పెట్రోల్ కొరత ఎందుకు వచ్చదనే దానిపై ఎవరూ సమాధానం చెప్పడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version