ఏపీ సచివాలయ నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది – మంత్రి అమర్నాథ్

-

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో ప్రజాధనాన్ని దోచుకున్నారని అసెంబ్లీలో ఆరోపించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏపీ సచివాలయ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు అవినీతి పై జాతీయ పత్రికల్లో కథనాలు వచ్చాయని పేర్కొన్నారు. చంద్రబాబు పిఏ అవినీతిపై ఐటి నోటీసులు ఇచ్చిందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

2000 కోట్ల వరకు అవినీతి జరిగిందని అనుమానించిందని తెలిపారు. కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్లు ఐటీ శాఖ చెప్పినట్లు వివరించారు. చంద్రబాబు పీఏ అవినీతిపై ఐటి శాఖ రిపోర్ట్ కూడా ఇచ్చిందన్నారు. చంద్రబాబు దోపిడీ గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మనోజ్ వాసుదేవ్ 2019లో చంద్రబాబును కలిశారని, ఆయన షాపూర్ జి పల్లోంజి సంస్థ ప్రతినిధి అని తెలిపారు. వివిధ సంస్థలకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చి నిధులు మళ్ళించారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version