ఒత్తిడి లేకుండా హాయిగా ఉండాలంటే ఇవి ముఖ్యం..!

-

ప్రతిరోజు కూడా మనకి ఎన్నో పనులు ఉంటాయి. దీనితో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కూడా తీవ్ర ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా..? ఒత్తిడి నుండి బయటపడడానికి చూస్తున్నారా అయితే కచ్చితంగా మీరు వీటిని ఫాలో అవ్వాలి. వీటిని కనుక మీరు గుర్తు పెట్టుకుంటే కచ్చితంగా ఒత్తిడి లేకుండా హాయిగా జీవించొచ్చు. మనం చేసే చిన్న చిన్న మార్పుల వలన ఒత్తిడి నుండి దూరంగా ఉండొచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఒక జర్నల్ రాయండి

ప్రతిరోజు మీరు ఒక డైరీ లాగ జర్నల్ రాయడం మొదలు పెట్టండి దీనితో మానసికంగా మీరు ఆనందంగా జీవించడానికి అవుతుంది పైగా ఎటువంటి బాధ లేకుండా హాయిగా జీవించడానికి అవుతుంది. కాస్త సమయాన్ని జర్నల్ రాయడానికి కేటాయిస్తే కచ్చితంగా ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవచ్చు.

యోగ లేదా ధ్యాన పద్ధతులు

యోగా లేదా ధ్యాన పద్ధతుల్ని అనుసరించి కూడా మీరు ఒత్తిడి లేకుండా ఉండొచ్చు. శ్వాసక్రియ, శరీర స్పృహ, విజువలైజేషన్ వంటి పద్ధతులతో ఉన్న ధ్యాన పద్ధతుల్ని అనుసరించండి. యోగ మెడిటేషన్ ద్వారా కూడా ఒత్తిడి ని దూరం చేసుకోవచ్చు కాబట్టి వీటిని కూడా రెగ్యులర్ గా అనుసరిస్తూ ఉండండి. తప్పకుండా ఒత్తిడి లేకుండా హాయిగా ఉండడానికి అవుతుంది.

అవగాహన అవసరం

మీ ఆలోచనలు మాటలు పట్ల ప్రవర్తనంగా ఉండాలి. కూర్చున్నప్పుడు తినేటప్పుడు ఇలా ఏ పని చేసినా కూడా దాని మీద ధ్యాస పెట్టాలి అలానే మీరు భవిష్యత్తు గురించి గతం గురించి కాకుండా వర్తమానం మీద శ్రద్ధ పెట్టండి ఏదోలా కాలాన్ని గడిపేయకుండా కాలాన్ని వినియోగించుకుంటూ ఉండండి ఇలా ఒత్తిడి లేకుండా జీవించేందుకు అవుతుంది.

కృతజ్ఞతతో ఉండండి

మీకు వచ్చే ప్రతి చిన్న విషయానికి కూడా మీరు కృతజ్ఞత చెప్పండి అలానే ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి చూడండి మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి చూడండి. అందరి పట్ల కృతజ్ఞతగా ఉండండి ముఖ్యంగా పాజిటివ్ గా ఉండండి ఇలా అనుసరిస్తే కూడా ఒత్తిడి లేకుండా హాయిగా జీవించేందుకు అవుతుంది. అలానే ఒత్తిడి లేకుండా హాయిగా ఉండడానికి మ్యూజిక్ కూడా సహాయపడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version