ఆస్కార్ బ‌రిలో ఉన్న 5గురు హీరోలు వీళ్లే

-

కాసేప‌టి క్రితం ఆస్కార్ అవార్డు బ‌రిలో ఉన్న హీరోల పేర్ల‌ను అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల నుంచి వ‌చ్చిన నామినేషన్ల‌ను ప‌రిశీలించిన ఆస్కార్ బృందం ఆస్కార్ అవార్డు కోసం నామినేషన్ల‌ను ప్ర‌క‌టించింది. ఈ లీస్ట్ లో అమెరికాకు చెందిన‌ బీయింగ్ రిచ‌ర్డ్స్ సినిమాలో హీరోగా న‌టించిన జేవియ‌ర్ బార్డెమ్ ఉన్నారు. అలాగే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల‌లో విడుద‌ల అయిన ది ప‌వ‌ర్ ఆఫ్ ది డాగ్ అనే సినిమా హీరో బెనెడిక్ట్ కంబ‌ర్ బ్యాచ్ కూడా ఆస్కార్ నామినిలో ఉన్నారు.

ది ప‌వ‌ర్ ఆఫ్ ది డాగ్ సినిమా ది బేస్ట్ సినిమాల‌లో కూడా నామినేషన్ల‌లో ఉంది. అలాగే అమెరికాకు చెందిన టిక్ టిక్ బూమ్ అనే సినిమాలోని హీరో ఆండ్రూ గార్ఫీల్డ్ కూడా ఆస్కార్ నామినిలో ఉన్నాడు. కింగ్ రిచ‌ర్డ్స్ మూవీలోని వీల్ స్మిత్ తో పాటు ది ట్రాజెడీ ఆఫ్ మెక్ బెత్ అనే అమెరికా సినిమాలోని డెంజ‌ల్ వాషింగ్ట‌న్ కూడా ఆస్కార్ నామిని లీస్ట్ లో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version