రావి చెట్టుని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే…!

-

మన సంప్రదాయం ప్రకారం కొన్ని చెట్లని దేవతా వృక్షాలుగా భావించి వాటిని మొక్కడం సహజం. ఇలా చెట్లకి కూడా పూజలు చేసి కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని మన నమ్మకం. రావి చెట్టు ఎంతో పరమ పవిత్రమైనది అని సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్భాగవతంలో తెలియజేశాడు. ఎంతో పవిత్రంగా భావించే ఈ రావిచెట్టును సాక్షాత్తు ఆ విష్ణుభగవానుడు నిలయంగా భావిస్తారు. ఇది ఇలా ఉంటే అలాంటి దేవత వృక్షాల లో ఒకటైన రావి చెట్టుకు పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయం చాల మందికి తెలియకపోయి ఉండొచ్చు. మరి మీకు కూడా తెలియనట్టైతే మొత్తం చూసి ఇప్పుడే తెలుసుకోండి.

peepal tree

భవిష్య పురాణం ప్రకారం కొడుకుని కనడం కన్నా, బాటలో వృక్షాన్ని పెంచడం మిన్న అని భవిష్య పురాణం చెబుతుంది. అంతేకాకుండా ఈ రావి చెట్టును అశ్వత్థ వృక్షంగా కూడా పరిగణిస్తారు. ఇది ఇలా ఉండగా స్కంద పురాణం ప్రకారం రావి చెట్టు వేర్లలో విష్ణు భగవానుడు, చెట్టు కాండంలో శివుడు, చెట్టు కొమ్మల్లో నారాయణుడు, ఆకులలో హరి, చెట్టు కాయలు సకల దేవతలు కొలువై ఉంటారని చెబుతోంది. అయితే ఇటువంటి గొప్ప మహోన్నతని కలిగిన రావి చెట్టును పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి.

రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. ఈ రావి చెట్టు ఆకుల పై దీపారాధన చేయడం వల్ల ఏలినాటి గ్రహ దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అలానే ఎర్రని వస్త్రం లో ముడుపు కట్టి రావి చెట్టుకి కట్టడం వల్ల సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.

Read more RELATED
Recommended to you

Exit mobile version