భారత్‌లో 5జి సేవలు ఇంకా ప్రారంభం కానే లేదు. కానీ 5జి ఫీచర్ ఉన్న ఫోన్లను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో నిత్యం 5జి స్మార్ట్ ఫోన్లను కొంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. అయితే 5జి ఫోన్‌లను కొనాలని అనుకునేవారికి మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ 5జి ఫోన్లు ఏవో తెలియడం లేదు. ఏది కొనాలి ? అని సందేహిస్తున్నారు. అలాంటి వారి కోసమే ఉత్తమ 5జి ఫోన్ల వివరాలను కింద అందిస్తున్నాం. వాటిని తెలుసుకోవడం ద్వారా మీరు మీకు నచ్చిన బెస్ట్ 5జి ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
రియల్ మి ఎక్స్7
ఇందులో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, మీడియాటెక్ డైమెన్సిటీ 800 యు ప్రాసెసర్, వెనుక భాగంలో 4 కెమెరాలు, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా, 4310 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. దీని ధర రూ.19,999గా ఉంది.
షియోమీ ఎంఐ 10ఐ
ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల డిస్‌ప్లే, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 705జి ప్రాసెసర్, వెనుక భాగంలో 108 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా, 4820 ఎంఏహెచ్ బ్యాటరీ.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్ ధర రూ.21,999.
వన్ ప్లస్ నార్డ్
ఈ ఫోన్‌లో 6.44 ఇంచుల డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్, వెనుక భాగంలో 4 కెమెరాలు, ముందు భాగంలో 32, 8 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు, 4115 ఎంఏహెచ్ బ్యాటరీ.. వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.27,999గా ఉంది.
పైన తెలిపిన 3 ఫోన్లకు ప్రస్తుతం మార్కెట్‌లో ఆదరణ బాగా లభిస్తోంది. అందువల్ల వినియోగదారులు వాటిల్లో దేన్నయినా కొనుగోలు చేయవచ్చు.