వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుపై సిబిఐ కేసులు నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు ని మోసగించడంతో ఆయనపై కేసులు పెట్టారు. బ్యాంకును మోసగించిన అభియోగంపై పార్లమెంట్ సభ్యుడు రఘు రామకృష్ణ రాజు పై కేసు నమోదు చేసామని సిబిఐ పేర్కొంది. ఎఫ్ఐఆర్ లో నిందితులుగా “ఇండ్ భారత్ సంస్థ”, రఘు రామకృష్ణ రాజు తో సహా, మొత్తం 10 మందిని సిబిఐ అధికారులు చేర్చారు.
ఐపీసీ సెక్షన్లు 120(బీ), 420తో పాటు “అవినీతి నిరోధక చట్టం” 13(2), 13(1)(డీ) కింద కేసు నమోదు చేసారు. “పంజాబ్ నేషనల్ బ్యాంక్” చీఫ్ మేనేజర్ సౌరభ్ మల్హోత్రా ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. మోసం విలువ రూ. 826.17 కోట్లుగా గుర్తించారు. అయితే తన మీద ఎలాంటి సిబిఐ దాడులు జరగలేదు అని రఘు ఒక వివరణ ఇచ్చారు.