నేడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర వివరాలు ఇవే

-

బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో 8 వ రోజుకు చేరింది. నేడు నకిరేకల్ నియోజకవర్గంలోని సుంకేనాపల్లి నుండి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. సుంకేనాపల్లి నుండి చిట్టెడు గూడెం, ఎల్లంకి మీదుగా.. సిరిపురం వరకు ఈ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగనుంది. నేడు మొత్తం 14.5 కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర కొనసాగించనున్నారు. నేడు రాత్రికి సిరిపురం సమీపంలో రాత్రికి బస చేయనున్నారు బండి సంజయ్.

యాదగిరిగుట్టలో ప్రారంభమైన ఈ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఐదు జిల్లాల్లోని 12 నియోజకవర్గాలను చూడుతూ.. 328 కిలోమీటర్ల మేర 24 రోజులపాటు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. ఈనెల 26న భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగియనుంది. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా.. ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version