తాజా నివేదిక: కరోనా కాలంలో అత్యంత సురక్షితమైన ఎయిర్ లైన్స్ ఇవే..

-

కరోనా సృష్టించిన భీభత్సాల్లో విమాన సర్వీసులు నిలిచిపోవడం కూడా ఒకటి. ఒక్క విమానాలే కాదు, ఒక చోటి నుండి మరో చోటికి ప్రయాణించాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడిప్పుడు కరోనా భయాలు తగ్గుతున్నాయి, అదీగాక వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తున్నందున ఇంతకుముందులా భయపడట్లేదు. కానీ కరోనా స్ట్రెయిన్ వచ్చేస్తుందేమోనన్న భయం మాత్రం లోపల వెంటాడుతూనే ఉంది. కరోనా కారణంగా నష్టపోయిన వాటిల్లో విమాన రంగం కూడా ఒకటని ఇంతకుముందే చెప్పుకున్నాం.

2020సంవత్సరంలో దాదాపుగా ఆరునెలల పాటు గాల్లో విమానాలు ఎగరలేదు. దానివల్ల విమాన సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదలా ఉంటే, విమానాలు గాల్లో ఎగరడం మొదలయ్యాక, అనేక నియమ నిబంధనలు తెరపైకి వచ్చాయి. కరోనా వల్ల ఈ నియమ నిబంధనలు విమాన సర్వీసులన్నీ ఖచ్చితంగా పాటించాయి. ఐతే అలా పాటించిన ఎయిర్ లైన్స్ లో ఇరవై ఎయిర్ లైన్స్ సర్వీసులకి ఎయిర్ లైన్స్ రేటింగ్ సైట్ ఎంపిక చేసింది. అత్యంత సురక్షితమైన ప్రయాణాన్ని అందించిన 20ఎయిర్ లైన్స్ ఏవేవో ఇక్కడ చూద్దాం.

పీపీఈఈ కిట్లు, ఫేస్ షీల్డులు సహా అన్ని సంరక్షణ చర్యలు తీసుకున్న ఎయిర్ లైన్ సంస్థలు..

ఎయిర్ బాల్టిక్, ఎయిర్ న్యూజిలాండ్, అలస్కా ఎయిర్ లైన్స్, ఆల్ నిప్పాన్ ఎయిర్ వేస్, ఎయిర్ ఏసియా, బ్రిటీష్ ఎయిర్ వేస్, కథాయ్ పసిఫిక్ ఎయిర్ వేస్, డెల్టా ఎయిర్ లైన్స్, ఎమిరేట్స్, ఎతిహాద్ ఎయిర్ వేస్, ఈవా ఎయిర్, జపాన్ ఎయిర్ లైన్స్, జెట్ బ్లూ, కే ఎల్ ఎమ్, కొరియన్ ఎయిర్ లైన్స్, లుఫ్థాన్సా, సింగపూర్ ఎయిర్ లైన్స్, సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్, ఖతార్ ఎయిర్ వేస్, వెస్ట్ జెట్..

Read more RELATED
Recommended to you

Exit mobile version