ఓవర్‌ థింకింగ్‌ వల్ల వచ్చే నష్టాలు ఇవే..! మీరు అదే పనిచేస్తున్నారా..?

-

ఓవర్‌థింకింగ్..ఓవర్‌ వెయిట్‌ కంటే డేంజరిది. అవసరం ఉన్నవి లేనివి అని తేడా లేకుండా పదే పదే ఆలోచించండం. మనది కాకున్నా మనకే పట్టినట్లు ఫీల్‌ అవుతాం. మన సర్కిల్‌లో ఉన్న సహఉద్యోగులు కానీ, తోటి మిత్రులు కానీ వారిపైన ఎక్కువ ఆలోచన. వాళ్లు ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు అన్నారు, చేసి ఉండాల్సింది కాదు..ఇలా పదేపదే ఆలోచిస్తూ చాలా మంది తమ టైమ్‌ అంతా వేస్ట్‌ చేసుకుంటారు. వాళ్లకూ..తెలుసు..ఛీ అసలు ఎందుకు ఇదంతా..ఆలోచించి టైమ్‌ కిల్‌ చేసుకుంటున్నా…ఇక ఇప్పటినుంచి ఈ ఆలోచనలన్నీ బంద్‌ చేయాలి అనుకుంటారు..కానీ మనసు అదే పాట పాడుతుంది. ఇందులోంచి బయటపడటం ఎలా..? ఓవర్‌ థింకింగ్‌ వల్ల టైమ్‌ వేస్ట్‌ తప్ప ఇంకేదైనా నష్టం ఉందా.. అంటే ఉందనే చెప్తున్నారు నిపుణులు.
ఓవర్‌ థింకింగ్‌ వల్ల టైమ్‌ వేస్ట్‌ అవడమే కాకుండా..బోనస్‌గా వచ్చే నష్టాలేంటంటే..
ఎదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా ఇబ్బంది కలుగుతుంది. .ఏ పనీ చేయాలనిపించదు..ఒత్తిడికి గురవుతారు.
మానసికంగా చాలా డల్‌ అయిపోతారు.
చాలా చిరాకుగా ఉంటారు. వ్యక్తుల పట్ట కఠినంగా ప్రవర్తించవచ్చు. ఇది మీ సోషల్‌ రిలేషన్‌షిప్‌ మీద ప్రభావం చూపుతుంది.
విభిన్న దృక్కోణాల నుండి విషయాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడతారు.
డిప్రెషన్, తన గురించి చెడుగా ఆలోచించడం వంటి వాటికి దారితీస్తుంది.
ఆకలి కూడా సరిగ్గా వేయదు. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
మీ మీద మీకున్న నమ్మకం పోతుంది. ఏ టాస్క్‌ను ధైర్యంగా తీసుకోలేరు.
పదేపదే ఆలోచనలతో నైట్‌ సరిగ్గా నిద్రపోలేరు..నిద్రపోయినా ప్రశాంతత ఉండదు. నిజానికి మనం రోజుకు 6-8 గంటలు పడుకున్నా అందులో క్వాలిటీ స్లీప్‌ కౌంట్‌ చాలా తక్కువగా ఉంటుంది. గాఢ నిద్రలో గట్టిగా 2-3 గంటలు కూడా ఉండటం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. బెడ్‌మీద ఉన్నా..వంటింట్లో అమ్మచేసే శబ్ధాలు మన మెదడుకు వినిపిస్తాయి, బయట చెత్తబండిగోలా మన చెవుల్లో పడుతుంది. ఇలాంటివి అన్నీ మీరు నిద్రపోతున్నా వింటున్నారంటే..మీరు ప్రశాంతంగా నిద్రపోవడం లేదనే.. వివిధ కారణాల వల్ల క్వాలిటి స్లీప్‌ కౌంట్‌ తగ్గుతూ వస్తుంది. క్వాలిటీ స్లీప్‌ ఎంత ఎక్కువగా ఉంటే మనిషి అంత యాక్టివ్‌గా ఉంటాడు.

తగ్గించుకోవడం ఎలా.?

మనకు ఇవన్నీ అవసరమా..? ప్రతి మనిషికి తన టైమ్‌ చాలా ముఖ్యం..మనం ఎంత మన టైమ్‌కు వాల్యూ ఇవ్వకపోతే.. క్యూలైన్లలో నుల్చోవాల్సి వచ్చినప్పుడు షార్ట్‌కట్స్‌ వెతుక్కుంటాం, ఎవరికోసమైన వెయిట్‌ చేయాల్సి వచ్చినప్పుడు ఎంత చిరాకు పడతాం, ఇవి కళ్లకు కనిపిస్తాయి కాబట్టి..టైమ్‌ వేస్ట్‌ అవుతుందని తెలుస్తుంది. కంటికి కనిపించకుండా చేసేవి చాలా ఉంటాయి..అందులో ఈ ఓవర్‌ థింకింగ్‌ మొదటిది..దీన్ని తగ్గించుకోవాలంటే.. వేరే వాళ్ల దగ్గర థార్డ్‌ పర్సన్‌ గురించి మాట్లాడడం మానేయాలి. అది పాజిటివ్‌ అయినా, నెగిటివ్‌ అయినా సరే.. మనకెందుకు చెప్పండి. మీరు చదువుకున్నట్లైతే.. కెరీర్‌పై దృష్టిపెట్టండి. ఉద్యోగంలో ఉన్నట్లైతే.. నెక్ట్స్‌ జాబ్‌మీద టార్గెట్‌ పెట్టుకోండి.. మీలో ఏవైనా స్కిల్స్‌ తక్కువగా ఉంటే అవి ఎలా డవలప్‌ చేసుకోవాలి, ఇంకా ఏం నేర్చుకోవాలి, మనల్ని మనం ఎంత మార్కెటింగ్‌ చేసుకుంటే..మనకు అంత డిమాండ్ పెరుగుతంది. అందరి రెస్యూమ్‌లా మీదీ ఉంటే..మనకేంటి స్పెషాలిటీ.. ఎంత ఎక్కువ స్కిల్స్‌ ఉంటే.. అవన్నీ రెస్యూమ్‌లో యాడ్‌ చేసుకోవచ్చు.. కెరీర్‌లో ఎడ్యుకేషన్‌ స్జేజ్‌, జాబ్‌ ఇనీషియల్‌ స్జేజ్‌ చాలా ముఖ్యం.. ఇక్కడే మనకు తెలియని ఎన్నో చిక్కులుపడుతుంటాయి. లవ్‌ అని లైఫ్‌ పాడుచేసుకునేది కూడా ఇక్కడే..! కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. లైఫ్‌ అనేది ఒక రేస్‌ లాంటిదని ఆయనెవరో కరెక్టుగానే చెప్పారు..రేస్‌లో ముందుండాలంటే..ఓపికున్నంత వరకూ కాదు..ఊపిరున్నంత వరకూ పోరాడాలి.!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version