త్రివిక్రమ్ ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసిన ముగ్గురు స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ త్రివిక్రమ్ మాటల మాంత్రికుడిగా పేరు పొందారు. తనదైన స్టైల్ లో డైలాగులు చెప్పిస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటారు. ఇక ఎంతోమంది హీరోయిన్లను సైతం పరిచయం చేశారు ఈ స్టార్ డైరెక్టర్. అయితే ఇదిలా ఉండగా ఈ డైరెక్టర్ అడిగినా కూడా ముగ్గురు స్టార్ హీరోయిన్ లు మాత్రం నటించమని నిర్మొహమాటంగా తేల్చి చెప్పారట. ఆ హీరోయిన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు తో మూవీ నీ తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకోసం హీరోయిన్లను వెతికే పనిలో ఉన్నారు. అలా మొదటగా హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోందని ఆ సినిమా ఓపెనింగ్స్ కి కూడా పిలవడం జరిగింది. ఇక ఈమెతో పాటు ఇందులో మరొక హీరోయిన్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందట. అందుకోసం ఒక స్టార్ హీరోయిన్ నటిస్తే బాగుంటుందని త్రివిక్రమ్ ఆలోచించారు. అలా పెళ్లి సందD హీరోయిన్ శ్రీ లీలను మహేష్ బాబు సరసన రెండవ హీరోయిన్గా నటించేందుకు అడగగా ఆమె కూడా వెనుతిరిగినట్లు తెలుస్తోంది.

అయితే అందుకు కారణం ప్రస్తుతం మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నందువల్ల ఈ చిత్రంలో రెండో హీరోయిన్ అంటే రాబోయే రోజులలో ఈమెకు ఇలాంటి పాత్రలే వస్తాయని ఈమె భావించి వద్దని చెప్పినట్లు సమాచారం.

దీంతో త్రివిక్రమ్ చేసేదేమీ లేక మరొక హీరోయిన్ నబా నటేశాను కూడా సంప్రదించారు. అయితే ఈమె కూడా పలు కారణాలు చెప్పి ఆ పాత్రను చేయడానికి ఒప్పుకోలేదట.

ఇక దీంతో చేసేదేమీ లేక మరొక హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా అడగగా.. ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఈ సినిమాలో నటించనని చెప్పేసిందట. దీంతో ఈ ముగ్గురు హీరోయిన్ లకు త్రివిక్రమ్ అవకాశం ఇచ్చినా కూడా నటించమని చెప్పడంతో ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు షాక్ కి గురవుతున్నారు. మరి ఈ పాత్రకు ఏ హీరోయిన్ దొరుకుతుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version