పెళ్ళాం గా ఉంటే నెలకు రూ. 25 లక్షలు ఇస్తా అన్నాడు.. నీతూ చంద్ర !!

-

నీతూ చంద్ర గురించి మనం పెద్దగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. మొదటిసారి 2003లో విష్ణు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత ఈమెకు బాగా అవకాశాలు రావడంతో సుమంత్ హీరోగా నటించిన గోదావరి సినిమాలో హీరో సుమంత్ కి మరదలు పాత్రలో రాజీగా నటించి అక్కడ కూడా తన అందంతో చలాకీతనంతో బాగా ఆకట్టుకుంది.. ఇక ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా వచ్చిన సత్యమేవ జయతే సినిమాలో కూడా హీరోయిన్గా నటించగా..అక్కడ నుంచి ఈమె మరెన్నో అవకాశాలను అందుకుంటుంది అని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ నీతూ చంద్రకు మాత్రం తెలుగులో ఆశించిన అంత స్థాయిలో అవకాశాలు రాలేదు.

హీరోయిన్ గా అవకాశం రాకపోయేసరికి నాగార్జున తన కుటుంబంతో కలిసి నటించిన మనం సినిమాలో ఎయిర్ హోస్టుగా పనిచేసే అమ్మాయి పాత్రలో కనిపించింది. కానీ అక్కడ కూడా ఈమెకు గుర్తింపు రాకపోవడంతో తిరిగి బాలీవుడ్లోకి మఖాం మార్చింది. అక్కడ వరుస ఆఫర్లు అందుకొని నటన పరంగా దూసుకు వెళ్తూనే నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.

ఇక నీతూ చంద్ర తమ్ముడు నితిన్ చంద్ర ఒక గొప్ప దర్శకుడు.. బాలీవుడ్ లో తెరకెక్కించిన ఒక సినిమాకు నీతూ చంద్ర నిర్మాతగా వ్యవహరించగా.. అందుకోసం ఈమెకు నేషనల్ అవార్డు కూడా లభించింది. ఇక తర్వాత సినిమా అవకాశాలు లేక దూరంగా ఉండిపోయిన ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను జీవితంలో ఎదుర్కొన్న బాధల గురించి వెల్లడించింది.

ఇకపోతే నీతూ చంద్ర మాట్లాడుతూ ఒకవైపు సినిమాలలో బిజీగా ఉన్న సమయంలోనే ఇండియాలోనే అతిపెద్ద బిజినెస్ మాన్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది కానీ నేను సినిమా ఆఫర్ అనుకున్నాను. కానీ ఆయన దగ్గరికి వెళ్లి కలవగానే.. ప్రతి నెల జీతం తీసుకునే భార్యగా వ్యవహరించమని.. ఆయన ఆఫర్ చేశాడు. అలా ఎన్ని నెలలు ఉండగలిగితే అలా ఒక్కొక్క నెలకు 25 లక్షల రూపాయలు చొప్పున ఇస్తానని భార్యగా ఉండమని చెప్పాడు..అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది నీతూ చంద్ర.

Read more RELATED
Recommended to you

Exit mobile version