ఉత్త‌రం రాస్తే స‌మ‌స్య‌లు తీర్చే దేవుడు.. కోరిక‌లు ఇట్టే నెర‌వేర‌తాయ్‌..!!

-

మ‌న‌కు ఏదైనా క‌ష్టం వ‌స్తే దేవాల‌యాలు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తాం.. క‌ష్టాలు తీర్చ‌మ‌ని మొక్కులు మొక్కుతాం.. కోరిక తీరితే మొక్కులు చెల్లించుకుంటాం. అయితే ఇప్పుడు మ‌నం తెలుసుకోబోయే దేవుడు చాలా ప్ర‌త్యేకం..

మ‌న స‌మ‌స్య‌ల‌ను ఉత్త‌రంలో రాసి పోస్ట్ చేస్తే చాలు స‌మ‌స్య‌లు ఇట్టే తీరిపోతాయ్.. ఈ దేవాల‌యం రాజస్థాన్‌లోని సవాయ్‌ మధోపూర్‌లో ఉంది. ఈ రణథంబోర్ త్రినేత్ర గణేశుడికి కోర్కెలు తీర్చమని వివరిస్తూ ఒక్క ఉత్తరం రాస్తే చాలు.. కష్టాలు మాయమవుతాయని చెబుతారు. రణథంబోర్ దేవాల‌యాన్ని రణభన్వర్ ఆలయం అని పిలుస్తారు. కొంద‌రు పెళ్ళి కావాల‌ని రాస్తే, మ‌రి కొంద‌రు చ‌దువుల్లో రాణించాల‌ని , మంచి ఉద్యోగం కావాలని కొందరు రాస్తే.. ప్రమోషన్లు కావాలని మరికొందరు స్వామివారి పాదాల చెంతకు ప్రతిరోజూ దరఖాస్తులు వస్తుంటాయి.

అయితే ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా ర‌ణ‌థంబోర్ వినాయ‌కుడికి ఉత్త‌రం రాస్తే క‌టాక్షిస్తాడ‌ని పండితులు చెబుతున్నారు. భక్తులు రాసే ఉత్తరాలను రోజూ ఓ పోస్టుమ్యాన్ స్వామివారి సన్నిధికి తీసుకురావడం ఈ ఆలయం యొక్క‌ మరో ప్రత్యేకత. ప్రతిరోజూ వేలాది ఆహ్వాన లేఖలు మరియు లేఖలు పోస్ట్ ద్వారా ఇక్కడకు వస్తాయి.

రణథంబోర్ ఆల‌యం చాలా పురాతనమైనది. ఈ ఆలయం 1579 అడుగుల ఎత్తులో ఆరావళి మరియు వింధ్యచల్ కొండలలో ఉంది. వినాయకుడు మూడు నేత్రాలతో వెలిశాడు ఈ త్రినేత్ర విఘ్నేశ్వరుడి ఆలయంలో  లంబోధరుడితోపాటు ఆయ‌న‌ భార్యలు రిద్ది, సిద్ధి, కుమారులు శుభ్‌, లాభ్ లు కొలువై ఉన్నారు. ఇలా వినాయ‌కుడితోపాటు ఆయ‌న కుటుంబం మొత్తం కొలువైన ఏకైక ఆలయం ఇది.

త‌మ క‌ష్టాలు తీర్చ‌మ‌ని ఉత్త‌రాలు మాత్ర‌మే కాదు.. భ‌క్తులు త‌మ ఇళ్ళ‌ల్లో జ‌రిగే ప్ర‌తీ శుభ‌కార్యానికి తొలి ఆహ్వాన ప‌త్రిక‌ను పంపుతూ ఉంటార‌ట‌.

స్థలపురాణం :

మహారాజా హమ్మిరదేవ 10వ శ‌తాబ్దంలో ఈ దేవాల‌యాన్ని ర‌ణ‌థంబోర్ కోట‌లో నిర్మించారు. అల్లాఉద్దీన్​ ఖిల్జీతో యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ కోటను తొమ్మిది నెలలకు పైగా శత్రువులు చుట్టుముట్టారు. హ‌మ్మిర‌దేవ క‌ల‌లో త్రినేత్ర గ‌ణేషుడు కనిపించి కోట‌లో తాను వెలిసిన‌ట్టు తెలిపి పూజ‌లు చేయ‌మ‌ని చెప్పార‌ట‌.. త‌రువాత ఖిల్జీపై విజయం సాధించిన హమ్మిర‌దేవ త్రినేత్ర వినాయకుడి ఆలయం నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు.

రణథంబోర్ స్వామి వారి అడ్రస్ 
Address:
రతంబోర్ త్రినేత్ర గణేష్ ఆలయం,
రణథంబోర్​ గ్రామం,
సవాయ్​ మధోపుర్​ జిల్లా, రాజస్థాన్ – 322021

Read more RELATED
Recommended to you

Exit mobile version