మెగాస్టార్ చిరంజీవి​ హిస్టరీలో టాప్-10 మూవీస్ ఇవే!

-

రీమేక్ అంటే.. సగటు ప్రేక్షకుడు ఏం ఫీలవుతాడంటే.. ఒరిజినల్ మూవీలోని ఆర్టిస్టులు మాత్రమే మారుతారని భావిస్తాడు. కానీ.. లూసీఫర్​ విషయంలో మాత్రం “కథ” వేరే! ఒరిజినల్ వెర్షన్​లోని సోల్ మాత్రమే తీసుకున్న దర్శకుడు.. సినిమా మొత్తం మార్చిపడేశాడు. ఎంతలా ఛేంజ్ చేశాడంటే.. లూసీఫర్ చూసి వచ్చినవారు కూడా.. “గాడ్​ఫాదర్​”ను క్యూరియాసిటీతో ఎంజాయ్ చేసేంతగా మలిచారు. అందుకే.. రీమేక్ అయినా.. రికార్డు కలెక్షన్స్​ తో దూసుకెళ్తోంది. మరి, గాడ్​ఫాదర్ చిత్రం ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది.. అన్న వివరాలతోపాటు.. చిరంజీవి టాప్​-10 మూవీస్ లిస్ట్ ఇక్కడ ఉంది. వికీపిడీయా, గూగుల్​, మరికొన్ని బాక్సాఫీస్​ వెబ్​సైట్ల లెక్కల ప్రకారం ఈ డేటాను అందిస్తున్నాం.

రిలీజ్​ అయిన ప్రతిచోటా పాజిటివ్​ టాక్ తెచ్చుకున్న “గాడ్​ఫాదర్”.. వ‌రల్డ్ వైడ్‌గా కలెక్షన్లలో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్​ డే రూ.38 కోట్లు గ్రాస్ రాబట్టిందని అంచనా. సెకండ్​ డే.. వరల్డ్ వైడ్ గా రూ.31 కోట్లు రాబట్టిందని ట్రేడ్ అనలిస్టులు లెక్కలు కట్టారు. అయితే.. ఫస్ట్​ డేతో పోలిస్తే.. సాధారణంగా రెండో రోజున కలెక్షన్లు 20 నుంచి 30 శాతం పడిపోతాయి. కానీ.. “గాడ్ ఫాదర్” సెకండ్​ డే కూడా బాక్సాఫీస్​ను షేక్ చేసింది. మొత్తంగా.. రెండు రోజుల్లో రూ.69 కోట్ల గ్రాస్ రాబట్టి.. మెగా వేవ్ కొనసాగిస్తోంది గాడ్ ఫాదర్.

సైరా : మెగాస్టార్ కెరీర్​లో తొలి పాన్​ ఇండియా చిత్రంగా రిలీజైన హిస్టారికల్ మూవీ సైరా. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రతో తెరకెక్కిన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పటి వరకూ చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచిపోయింది సైరా!

ఖైదీ నంబర్ 150 : దాదాపు దశాబ్ద కాలంపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తర్వాత.. రీ-ఎంట్రీలో చిరంజీవి నటించిన ఫస్ట్ మూవీ ఇది. తమిళ్ స్టార్ విజయ్ నటించిన “కత్తి” చిత్రానికి రీమేక్ ఇది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్​ గా నిలిచిన ఈ చిత్రం.. 104 కోట్ల షేర్ రాబట్టి.. దుమ్ము లేపింది.

ఇంద్ర : మెగాస్టార్ కెరియర్లో.. తొలిసారి రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్​తో తెరకెక్కిన చిత్రం ఇంద్ర. చిరంజీవి బిగ్గెస్ట్ హిట్లలో ఇంద్రకు ప్రత్యేక స్థానం ఉంటుంది. 2002లో విడుదలైన ఈ మూవీకి.. 13 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. విడుదలైన ప్రతిచోటా బాక్సాఫీస్​ ను షేక్​ చేసిన ఈ చిత్రం.. రూ.27 కోట్ల షేర్ రాబట్టింది.

శంకర్​దాదా MBBS : కామెడీని పండించే స్టార్ హీరోల్లో.. చిరంజీవి ముందు వరసలో ఉంటారు. అలాంటి ఫుల్ లెంగ్త్ రోల్​లో మెగాస్టార్ నటించిన చిత్రం శంకర్​దాదా MBBS. బాలీవుడ్ చిత్రం మున్నాభాయ్ ఎంబీబీఎస్​ కు రీమేక్​గా వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి రూ.14 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగితే.. ఏకంగా 26 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

ఠాగూర్ : తెలుగు సినిమాల్లో ప్రజలకు సందేశం ఇవ్వడం అనేదే ఎప్పుడో తరచుగా జరిగేది. అది కూడా ఓ పాత్రకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ.. పూర్తిస్థాయిలో అదే కంటెంట్ తో తెరకెక్కిన మెగా మూవీ “ఠాగూర్”. తమిళ్ మూవీ “రమణ”కు రీమేక్​ అయినప్పటికీ.. తెలుగు నేటివీటికి తగ్గట్టుగా మార్చారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ.. రూ.24 కోట్లు రాబట్టింది.

స్టాలిన్ : తమిళ దర్శకుడు మురుగదాస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం స్టాలిన్. చిరు-మురుగదాస్ కాంబోలో రూపొందిన చిత్రం కావడంతో అంచనాలు తారస్థాయికి చేరాయి. ఈ చిత్రానికి అప్పట్లోనే రూ.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ.. కేవలం 23 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

శంకర్​ దాదా జిందాబాద్ : ఎంబీబీఎస్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా.. ఫస్ట్ పార్ట్ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో.. శంకర్ దాదా జిందాబాద్ చిత్రం కేవలం 18 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.

అన్నయ్య : అన్నాదమ్ముల అనుబంధాన్ని వివరిస్తూ వచ్చిన చిరంజీవి చిత్రం.. “అన్నయ్య”. రవితేజ, వెంకట్ మెగా బ్రదర్స్​గా నటించారు. అన్నయ్య మూవీకి రూ.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా.. 13 కోట్ల షేర్ రాబట్టింది.

జైచిరంజీవ : ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైనప్పటికీ.. అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. 18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగితే.. కేవలం 12కోట్ల షేర్ ను మాత్రమే వసూలు చేసింది.

అంజి : ఎన్నో వాయిదాల అనంతరం విడుదలైన మెగా సోషియో ఫాంటసీ చిత్రం అంజి. ఇంద్ర, ఠాగూర్ వంటి వరుస విజయాల తర్వాత వచ్చిన ఈ చిత్రానికి బిజినెస్ భారీగానే సాగింది. రూ.24 కోట్ల వ్యాపారం జరిగింది. కానీ.. కేవలం 12 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version