ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం సుఖం రెండు ఉంటాయి. అయితే నిజానికి ఆనందంగా ఉండాలన్నా అనుకున్నది సాధించాలన్నా తప్పకుండా కొన్ని విషయాలని ఫాలో అవుతూ ఉండాలి. అయితే మనం ఆనందంగా గడపాలి అంటే కొన్ని విషయాలను ఇతరులతో పంచుకోవద్దు.
ఈ విషయాలను స్వయంగా చాణక్య నీతి ద్వారా ఆచార్య చాణక్య చెప్పారు. మీరు కనుక ఈ విషయాలను ఎవరితోనన్నా చెబితే చిక్కుల్లో పడినట్లే అయితే మరి ఎవరితోనూ చెప్పకూడని ఆ విషయాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
చాణక్య నీతి ప్రకారం వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలు ఎవరితోనూ చెప్పకూడదు. అలాగే భార్య భర్తల మధ్య జరిగే సంభాషణలు ఇతరులతో చెప్పకూడదు. ఆ విషయాలను వాళ్ళ మధ్య ఉంచుకోవాలి. అలానే మీకు మీ జీవిత భాగస్వామి కి మధ్య ఏమైనా గొడవలు ఉన్నట్లయితే వాటి కోసం మీ స్నేహితులకి చెప్పకండి. ఒకవేళ మీరు చెప్పారు అంటే గౌరవాన్ని కోల్పోవలసి ఉంటుంది.
అలానే మీరు ఏదైనా పని మొదలు పెడుతున్నట్లు అయితే దాని ప్రణాళిక గురించి చెప్పొద్దు ఎందుకంటే మీ పనికి ఇతరులు అడ్డు వచ్చే అవకాశం ఉంటుంది. దానితో మీరు అనుకున్నది పూర్తి చేయలేరు. పైగా పనిలో విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. వీటిని కనుక మీరు పంచుకుంటే తర్వాత ఇబ్బంది పడాల్సినది మీరే.