మోడి నిర్ణయానికి వాళ్ళంతా చెయ్యెత్తి దండం పెడుతున్నారు..!!

-

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అరికట్టడానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎవరు కూడా మార్చి 22వ తారీకు నుండి బయటకు రాకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. గుంపులు గుంపులుగా జనం ఉండకూడదని తగ్గించాలని ఇటీవల పేర్కొన్నారు. చాలావరకు వర్క్ ఫ్రొం హోమ్ విధానాన్ని అవలంబించాలని సూచించారు. కరోనా వైరస్ ని చాలా తేలికగా తీసుకోకూడదు జాగ్రత్తలు పాటిస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని, ఈ వైరస్ బారిన పడినవారికి ఐసోలేషన్ ద్వారా చికిత్స అందిస్తున్నామని అందరూ కలసి కనిపించనీ శత్రువుతో పోరాడాలని మోడీ పిలుపునిచ్చారు. మనం స్వయంగా ఆరోగ్యంగా ఉండటం అంటే ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచడమేనని ప్రధాని మోడీ అంటున్నారు. మనం ఆరోగ్యంగా ఉంటే..ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలంతా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోడీసూచించారు. సంకల్పం, కనీస జాగ్రత్తలు పాటిస్తే ఈ మహమ్మారిని అరికట్టవచ్చన్నారు. ఒంటరిగా ఉండటంతోనే ఈ మహమ్మారిని కట్టడి చేయవచ్చంటున్నారు మోడీ. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

 

ఒక వారం రోజులపాటు ఇంటి దగ్గరే ఉండి సెలవు తీసుకుని పనిచేయాలని ఒకరిని ఒకరు కలవటం మానేయాలని వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అవలంబించాలని సూచించారు. దీంతో మోడీ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చెయ్యెత్తి దండం పెడుతున్నారు. అడగకుండానే భలే సెలవులు ఇచ్చారని మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రధాని నిర్ణయం పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version