పొగ‌తాగే వారు క‌రోనాతో చ‌నిపోయే అవ‌కాశం ఎక్కువ‌.. ఎందుకంటే?

-

క‌రోనా మ‌ర‌ణాలు ఇప్పుడు ఏ స్థాయిలో న‌మోద‌వుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేసినా ఈ మ‌హ‌మ్మారికి బ‌లి కావాల్సిందే. అలా ఉన్నాయి మ‌రి రోజులు. ఇప్ప‌టి వ‌ర‌కు షుగ‌ర్‌, ఇత‌ర వ్యాధులు ఉన్న వారే ఎక్కువ‌గా మ‌ర‌ణిస్తుండ‌టం చూశాం. కానీ ఇప్పుడు ఈ అల‌వాటు ఉన్న వారు కూడా ఎక్కువ‌గా చ‌నిపోతున్నార‌ని తెలుస్తోంది.

పొగ త్రాగేవారికి వివిధ ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు కరోనాతో చ‌నిపోయే అవకాశాలు 50 శాతం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కాబ‌ట్టి పొగ‌తాగ‌డానికి డూరంగా ఉండాలంటూ చెబుతోంది.

పొగ తాగ‌డం మానేస్తే క్యాన్సర్‌, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు కూడా తగ్గుతాయ‌ని డబ్ల్యుహెచ్‌వో తెలిపింది. తాము చేపట్టిన క్విట్‌ టొబాకో క్యాంపెయిన్‌కు మంచి స్పందన వచ్చిందని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ స్ప‌ష్టం చేసింది. పొగ తాగ‌డాన్ని నిరోధించ‌డంలో అన్ని దేశాలు చేతులు కలపాలని కోరింది డ‌బ్ల్యూహెచ్‌వో.

Read more RELATED
Recommended to you

Exit mobile version