మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటన నర్సింహులపేట మండలం పెద్దనాగారం స్టేజీ సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో ఐదుగురు పరిస్థితి విషమం ఉండగా.. మరో 8 మందకి తీవ్ర గాయాలు అయ్యినట్లు సమాచారం. గాయాలపాలైన వారిని మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. మహిళలంతా తొర్రూర్ మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మిర్చి తోటలో మిరకాయలు ఏరేందుకు వీరంతా వెళ్తుండగా ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.