అక్కడ.. చెప్పులతో ఒకరినొకరు కొట్టుకుంటూ హొలీ చేసుకుంటారట..!

-

హోలీ రోజు చిన్నాపెద్దా..ఆడామగా తేడా లేకుండా.. ఒకరిమీద ఒకరు రంగులు చల్లుకుంటూ.. మస్త్ ఎంజాయ్ చేస్తారు కదా.. ఇదే హోలీని ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఉత్తరప్రదేశ్, మణిపూర్, గుజరాత్, బీహార్ ఇలా అనేక ప్రాంతాల్లో హోలీ పండగను ఒకొక్క రీతిన జరుపుకుంటారు. కొన్ని దగ్గర్లా..హోలీకి బాయ్స్ ను అనుమతించరు.. మరికొన్ని చోట్ల..చెప్పులతో కొట్టుకుంటూ.. హోలీ చేసకుంటారట. అరే ఇదేం కాన్సప్ట్ రా.. జోడించుకు కొట్టుకోవడం ఏంట్రా అనిపిస్తుంది కదా..మరీ బీహార్ లో జరిగే ఈ వెరైటీ హోలీ వెనుక కథేంటో చూసేద్దామా..!

బీహార్ రాజధాని పాట్నాలో హొలీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ హొలీ వేడుకలను ఓ వింత ఆచారంతో స్థానికులు జరుపుకుంటారు.. పాట్నాలో వాటర్ పార్క్ ఉంది. అక్కడ నిర్వహించిన హోలీలో స్థానికులు ఒకరికొకరు చెప్పులు విసురుకుంటూ కనిపించారు. వాటర్ పార్క్ ను రంగుల నీరుతో నింపేశారు. ఆ త‌ర్వాత స్థానికులు నీళ్ల‌లోకి దిగి.. అంద‌రూ ఒక‌రిని మ‌రొక‌రు చెప్పుల‌తో
తెగ కొట్టుకున్నారు. కొందరు చెప్పుల దెబ్బలు తినలేక అక్కడ నుంచి పారిపోయారు కూడా…. అయినా వదలకుండా.. వారి వెంటబడి మరీ చెప్పులతో రంగుల నీరుతో హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

రీజన్ ఏమై ఉండొచ్చు..?

ఇలా చెప్పులతో హొలీ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కారణం ఉంది. ఏంటంటే.. చెడు మీద మంచి విజయాన్ని సాధించిన గుర్తుగా హొలీ ఏ విధంగా జరుపుకుంటామో.. మనలో ఉన్న చెడు తొలగి.. మంచి ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ఇలా చెప్పులతో కొట్టుకుంటూ హోలీని జరుపుకుంటారట.

రీజన్ కాస్త రీజనబుల్ గా లేకున్నా..క్రేజీ అయితే ఉంది కదా.. చెప్పులతో కొట్టటుకుంటూ హోలీ.. దీనికి సంబంధించిని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అ‌వుతుంది. అందులో అందరూ.. వాటర్లో దిగి.. చెప్పులు విసురుకుంటూ, డ్యాన్స్ లు వేస్తూ…. భలే ఎంజాయ్ చేస్తున్నారు.

హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు.. అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోలిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు, అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు. అందుకే ఈరోజు కొన్ని ఏరియాల్లో హోలికా దహనం కూడా చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version