రెస్టారెంట్లలో రెగ్యులర్ గా ఫుడ్ తినేవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు..

-

ఆఫీసులో ఆరునెలలకి ఓసారో, కుటుంబంలో వారానికి ఒకసారో, బిజినెస్ వ్యవహారాల్లో తరచుగా రెస్టారెంట్ కి వెళ్ళడం మామూలే. ఐతే రెస్టారెంట్లలో ఫుడ్ తినాలనుకోవడం ఒక ఎక్స్ పీరియన్స్. కేవలం ఫుడ్ తినడానికే అయితే ఆన్న్ లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ రెస్టారెంట్ ఎక్స్ పీరియన్స్ అనుభవించడానికే ఎక్కువ మంది వెళ్తుంటారు. ఇలాంటప్పుడు కొన్ని ముఖ్య విషయాలని గుర్తుంచుకోవాలి.

బిర్యానీయో, లేదా మసాలా వంటకమో ఆర్డర్ చేసిన వారికి నిమ్మ చెక్కలు ఇస్తుంటారు. ప్రతీ రెస్టారెంట్లలో నిమ్మ చెక్కలు అంత శుభ్రంగా ఉండకపోవచ్చు. నిమ్మకాయలని కోసిన తర్వాత అలాగే వదిలేయడం చాలా రెస్టారెంట్లకి అలవాటు. అవి కావాలనుకున్నప్పుడు చేతితో తీసుకుని అలాగే పట్టుకొచ్చేస్తారు. అందుకే నిమ్మ చెక్కలని తినకపోవడమే మంచిది.

చిన్న పిల్లలని రెస్టారెంట్ కి తీసుకెళితే గనక చక్కెర కలిగిన పదార్థాలని తిననివ్వకండి. చిన్న పిల్లలకి తీపి అంటే ఇష్టం ఎక్కువ కాబట్టి, ఎక్కువ తీపి కలిగిన పదార్థాలని చిన్న పిల్లల కోసం రెడీ చేస్తారు రెస్టారెంట్ వాళ్ళు.

నాన్ వెజ్ తినని వారు స్పెషల్ గా వెజ్ మాత్రమే చెబితే అది నిజంగా వెజ్ అయ్యి ఉండకపోవచ్చు.

స్పెషల్ డిషెస్ అని చెప్పే ప్రతీ వంటకమూ స్పెషల్ కాకపోవచ్చు. ఆ వంటకం తొందరగా పూర్తవ్వాలన్న ఉద్దేశ్యంతో స్పెషల్ బోర్డ్ కి ఎక్కే అవకాశం కూడా ఉంది.

క్రెడిట్ కార్డు నంబరు రాసి సర్వర్ ని బిల్ కట్టమని ఇవ్వద్దు. అందరూ ఒకలా ఉండరు. కాబట్టి తెలియని వాళ్ళకి మీ వివరాలు తెలియాల్సిన అవసరం లేదు.

ఇంట్లో చేసిన వంటల మాదిరిగా భోజనం ఉంటుందన్న ప్రతీచోటా అలా ఉండే అవకాశం ఉండకపోవచ్చు.

మీరిచ్చే టిప్ ఒక్కరికే పోతుంది అనుకుంటే పొరపాటే. ఏ సర్వర్ కి టిప్ ఇచ్చినా అదంతా ఒక దగ్గర చేర్చి వాళ్ళంతా షేర్ చేసుకుంటారు.

పైన చెప్పిన విషయాలన్నీ అన్ని రెస్టారెంట్లలో ఒకేలా ఉండకపోవచ్చు. అందుకే ఏది సరైనదో ఏది కానిదో అనే విషయం తెలుసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version