ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వాడేవారు ఈ పనులు అస్సలు చేయకండి!

-

ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వల్ల చాలా సులభంగా, వేగంగా ఆన్‌లైన్‌ ట్రాన్సక్షన్స్‌ చేయవచ్చు. కానీ, మీరు చేసే చిన్న తప్పుల వల్ల పిషింగ్, విషింగ్, స్కిమ్మింగ్‌ ద్వారా హ్యాకర్స్‌ మీ డబ్బును కొట్టేస్తారు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ చేసేవారు ఇలాంటి బ్యాంకింగ్‌ స్కాం బారిన పడకుండా ఉండాలంటే కొన్ని పనులు అస్సలు చేయకూడదు. అవేంటో తెలుసుకుందాం..


పబ్లిక్‌ వైఫైతో బ్యాంకింగ్‌ ట్రాన్సక్షన్స్‌ చేయవద్దు

ఆన్‌లైన్‌ ట్రాన్సక్షన్స్‌ జరిపేటప్పుడు పబ్లిక్‌ వైఫై ద్వారా లవాదేవీలు జరపరాదు. హ్యాకర్స్‌ ఇన్ఫెక్టెడ్‌ సాఫ్ట్‌వేర్‌తో మీ డివైస్‌ డేటాని సులభంగా చోరీ చేసే అవకాశం ఉంది.

ఛార్జింగ్‌ పెట్టకండి

బహిరంగ ప్రదేశాల్లో ఛార్జింగ్‌ పెట్టకూడదు. జ్యూస్‌ జాకింగ్‌ అంటే యూఎస్‌బీ ద్వారా మీ మొబైల్‌ డేటా చోరీ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మీరు బయటకి ఎక్కడైనా వెళ్లాల్సి ఉంటే మీ ఛార్జర్‌ను తీసుకెళ్లడం మంచిది.

కస్టమర్‌ కేర్‌ నంబర్ల కోసం వెతక్కండి

ఎప్పుడైనా బ్యాంక్‌ల అఫిషియల్‌ వెబ్‌సైట్‌లనే సంప్రదించాలి. మీకు ఏదైనా అవసరం ఉంటే కస్టమర్‌ కేర్‌ నంబర్ల కోసం గూగుల్‌ సెర్చింగ్‌ చేయకూడదు.

గూగుల్‌ ప్లే స్టోర్‌ యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేయాలి

కేవలం గూగుల్‌ ప్లేస్టోర్‌ లేదా యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ద్వారానే మీకు కావాల్సిన యాప్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. తెలియని లింక్‌ల ద్వారా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే మీ స్మార్ట్‌ ఫోన్‌తోపాటు డేటా కూడా హ్యాక్‌ అయ్యే అవకాశం ఉంటుంది.

ఆండ్రాయిడ్‌ సెక్యూరిటీ అప్డేట్‌

ఆండ్రాయిడ్‌ అప్డేట్‌ చేయడంతో బగ్స్‌ ఇతర సమస్యలకు తొలగిపోతాయి. దీనివల్ల సైబర్‌ రిస్క్‌ కూడా తగ్గుతుంది. అందుకే ఓఎస్‌ కొత్త సెక్యూరిటీ వెర్షన్‌ ద్వారా హ్యాకర్లకు చెక్‌ పెట్టోచ్చు.

  • సోషల్‌ మీడియాలో కూడా మీ బ్యాంకి ంగ్‌ సంబంధిత వివరాలను షేర్‌ చేయకూడదు.
  • ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌లను సులభంగా పెట్టకూడదు. దీనివల్ల సైబర్‌ నేరగాళ్లు ఈజీగా పాస్‌వర్డ్‌ కనుక్కునే అవకాశం ఉంటుంది.
  • అలాగే, తరచూ మీ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌ ను మారుస్తూ ఉండటం ఎట్టి పరిస్థితుల్లో మరచిపోరాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version