రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ సామాజిక వర్గం పేరు చెప్పి విమర్శించడాన్ని చాలామంది వివిధ రకాలుగా నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. బాధ్యతగల పదవిలో ఉన్న వైయస్ జగన్ ఈ విధంగా మాట్లాడటం మంచిది కాదని సోషల్ మీడియాలో నెటిజనులు మరియు కొంతమంది ప్రజలు విమర్శలు చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే చంద్రబాబు సామాజిక వర్గం అని చెప్పి జగన్ చేసిన కామెంట్లు చాలావరకు కరెక్టే అని సీనియర్ రాజకీయ నేతలు అంటున్నారు.
ఇదే తరుణంలో పంచాయితీ ఎన్నికల వాయిదా విషయంలో పంచాయతీరాజ్ శాఖ తో కూడా చర్చలు జరపాలి. ఈ క్రమంలో ఎన్నికల వాయిదా విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవేమీ చేయకుండా సొంతంగా నిర్ణయం తీసుకొని విచక్షణ అధికారం పేరుతో ఎన్నికల వాయిదా వేస్తున్నట్లు పేర్కొనటం నిజంగా ఇది ఒక ఉద్దేశపూర్వకంగా ఎన్నికలను ఆపడమే అని అంటున్నారు. ఖచ్చితంగా జగన్ చేసిన కామెంట్ లో తప్పేమీ లేదని సమర్ధిస్తున్నారు. ఇదంతా ప్రజలు గమనించాల్సిన ఆలోచించాల్సిన విషయం అని కూడా సూచిస్తున్నారు.