ముగిసిన మూడో ద‌శ పోలింగ్.. యూపీ, పంజాబ్ లో ఓటింగ్ శాతం ఎంతంటే?

-

మూడో ద‌శ పోలింగ్ నేడు ఉత్త‌ర ప్ర‌దేశ్ తో పాటు పంజాబ్ రాష్ట్రాల్లో జ‌రిగిన విషయం తెలిసిందే. కాగ నేడు జ‌రిగిన మూడో ద‌శ‌ పోలింగ్ లో ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో 16 జిల్లాల్లోని 59 స్థానాల్లో ఓటింగ్ జ‌రిగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 627 మంది అభ్య‌ర్థులు త‌మ అదృష్టాన్ని ఈవీఎంల‌లో ఉంచారు. అలాగే పంజాబ్ రాష్ట్రంలో నేడు జ‌రిగిన పోలింగ్ లో మొత్తం 23 జిల్లాల్లో గ‌ల 117 స్థానాలకు ఒకే ద‌శ‌లో ఎన్నిక‌లు జ‌రిగాయి.

పంజాబ్ రాష్ట్రంలో మొత్తం 1,304 మంది అభ్య‌ర్థులు ఈ ఎన్నిక‌ల్లో పోటీల్లో నిలిచారు. కాగ రెండు రెండు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో క‌ట్టు దిట్ట మైన భ‌ద్ర‌తను ఏర్పాటు చేశారు. దీంతో ఎక్క‌డ కూడా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోలేదు. పోలింగ్ స్టేషన్ ల‌లో క‌రోనా నిబంధ‌న‌ల‌తో ఎన్నిక‌ల ప్ర‌క్రియా ముగిసింది. కాగ పంజాబ్ రాష్ట్రంలో నేడు జ‌రిగిన ఎన్నికల్లో మొత్తం 63.44 శాతం పోలింగ్ న‌మోదు అయింది. అలాగే ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో నేడు జ‌రిగిన మూడో ద‌శ పోలింగ్ లో 57 శాతం పోలింగ్ న‌మోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version